వాట్సాప్‌: ఒకసారి వద్దంటే వద్దంతే!

రీడ్‌ లేటర్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌... ఎందుకంటే?

Published : 15 Jan 2021 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఫ్రెండ్స్‌ పంపించే మెసేజ్‌లు, స్నేహితుల గ్రూప్‌లో ముచ్చట్లు, ఆఫీసులో గ్రూపులో టాస్క్‌లు, కాలేజీ గ్రూపులో మెమొరీస్‌... ఇలా మీ వాట్సాప్‌ ఛాట్స్‌ లిస్ట్‌ ఎప్పుడూ ఫుల్‌ అయిపోయి ఉంటుందా? అన్ని మెసేజ్‌ల మధ్య ముఖ్యమైన మెసేజ్‌లు మిస్‌ అవుతున్నారా? అయితే మీ ఇబ్బందిని తప్పించడానికి వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. మీరు వద్దనుకునే కాంటాక్ట్‌/గ్రూపు మెసేజ్‌లు ఇకపై వేరేగా చూసుకోవచ్చు.

ఏదైనా కాంటాక్ట్‌/గ్రూపు మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నా, వద్దనుకున్నా వాటిని ఆర్కీవ్‌ చేసుకోవచ్చు. అంటే ఆ కాంటాక్ట్‌/గ్రూపు మీ ఛాట్స్‌ లిస్ట్‌లో కనిపించదు. ఆఖరున ఆర్కీవ్స్‌ ట్యాబ్‌లో ఉంటుంది. అయితే అందులో ఎవరైనా మెసేజ్‌ పెడితే మళ్లీ లిస్ట్‌లో పైకి ఆ కాంటాక్ట్‌/గ్రూప్‌ వచ్చేస్తుంటుంది. దీని వల్ల మళ్లీ ఇబ్బంది స్టార్ట్‌. త్వరలో ఈ పరిస్థితి మీకు రాదు. ఎందుకంటే ఆర్కీవ్స్‌ ఫీచర్‌ను ఆధునీకరించి కొత్తగా మీ ముందుకు తీసుకొస్తోంది వాట్సాప్‌.  దాని పేరే ‘రీడ్‌ లేటర్‌’.

మీ వాట్సాప్‌లో మీరు ఓ కాంటాక్ట్‌/ గ్రూపు నోటిఫికేషన్లు ఒకసారి వద్దంటే.. ఇక వద్దు అంతే. దీని కోసమే ఈ ‘రీడ్‌ లేటర్‌’. అంటే... ఏదైనా కాంటాక్ట్‌/గ్రూప్‌ ఛాట్‌ మీ లిస్ట్‌లో కనిపించొద్దు అనుకుంటే దానిపై లాంగ్‌ ప్రెస్‌ చేసి పైన టాప్‌లో ఉండే మూడు చుక్కల మెనూ క్లిక్‌ చేస్తే ‘రీడ్‌ లేటర్‌’ అని ఉంటుంది. దానికి క్లిక్‌ చేస్తే మీ ఛాట్‌ లిస్ట్‌ ఆఖరులో ‘రీడ్‌ లేటర్‌’ అనే ఆప్షన్‌లోకి అవి చేరుతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఆ ట్యాబ్‌లోకి వెళ్లి ఛాట్స్‌ చదువుకోవచ్చు. రీడ్‌ లేటర్‌లో ఉన్న ఛాట్స్‌ నోటిఫికేషన్లు రావు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా కొంతమందికి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అందరూ వాడొచ్చు. 

ఇవీ చదవండి...

ఈ ల్యాపీలు రేంజ్‌... వేరే లెవల్‌!

శాంసంగ్‌ ప్రాసెసర్‌..గేమింగ్ ఛైర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని