WhatsApp: ఫొటోలు/వీడియోలు ఫార్వర్డ్‌లో అతి పెద్ద సమస్యకు వాట్సాప్‌ పరిష్కారం?

ఇమేజ్‌, వీడియోలతో పాటు టెక్స్ట్‌ ఉన్నప్పుడు ఆ మెసేజ్‌ల ఫార్వర్డ్‌ విషయంలో వస్తున్న ఇబ్బందులకు వాట్సాప్‌ (WhatsApp) చెక్‌ పెడుతోంది. త్వరలో దీని కోసం ఓ అప్‌డేట్‌ రానుంది. 

Published : 28 Oct 2022 10:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో ఫొటోలు, వీడియోలు వేరొకరికి ఫార్వర్డ్‌ చేయడం చాలా సులభం. అయితే ఆ ఫొటో లేదా వీడియోతో పాటు టెక్స్ట్‌ కూడా వస్తే.. దానిని ఫార్వర్డ్‌ (WhatsApp Forward) చేయడం చాలా కష్టం. ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తే కేవలం ఇమేజ్‌/వీడియో మాత్రమే వెళ్తుంది. దీంతో మళ్లీ ఆ మెసేజ్‌ టెక్స్ట్‌ను టైప్‌ చేయాల్సిందే. వాట్సాప్‌ యూజర్లు చాలా రోజులుగా ఈ ఇబ్బందిని ఫేస్‌ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ సమస్యకు వాట్సాప్‌ పరిష్కారం అందిస్తోంది. 

టెక్స్ట్‌ మెసేజ్‌తోపాటుగా ఇమేజ్‌/వీడియోను ఫార్వర్డ్‌ చేయాలంటే… ఆండ్రాయిడ్‌లో కొన్ని కిటుకులతో చేయొచ్చు కానీ.. ఐవోఎస్‌లో అసాధ్యం. ఆండ్రాయిడ్‌లో షేర్‌ ఆప్షన్‌ ద్వారా రెండూ ఫార్వర్డ్‌ చేయొచ్చు. అయితే త్వరలో అలాంటి ఇమేజ్‌/వీడియో ఫార్వర్డ్‌ చేస్తే మొత్తంగా వెళ్తుందట. ప్రస్తుతం ఈ దిశగా వాట్సాప్‌ వర్క్‌ చేస్తోంది. బీటా యూజర్లు కొంతమందికి ఇప్పటికే  ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అన్ని రకాల చెకింగ్‌లు పూర్తి చేసుకుని.. అంతా ఓకే అనుకుంటే ఈ ఫీచర్‌ను  రెగ్యులర్‌ యూజర్లకు అందిస్తారు. 

డీపీలు.. బ్లర్‌ ఇమేజ్‌లు

వాట్సాప్‌లో త్వరలో మరికొన్ని ఫీచర్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే అవి డిజైన్‌ మార్పులు మాత్రమే. గ్రూపుల్లో ఇప్పటివరకు ఆ మెసేజ్‌ పెట్టిన వారి పేరు/ నెంబరు మాత్రమే కనిపిస్తోంది. త్వరలో వాళ్ల డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)ను చూపిస్తారట. అలాగే ఫొటోలను పంపేముందు వాటిని బ్లర్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఇస్తారట. ఈ ఆప్షన్లు కూడా టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని