Whatsapp Exit: ఈ వాట్సాప్‌ గ్రూపు నుంచి ‘ఎగ్జిట్‌’ అయిపోయారు? అని వస్తోందా?

whatsapp group exit bug issue: మీకు తెలియకుండానే గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయ్యారని వస్తోంది. 

Updated : 23 Sep 2022 13:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వాట్సాప్‌ గ్రూపులను (WhatsApp groups) వాడుతున్నవారికి గత కొన్ని రోజులుగా ఓ సమస్య వస్తోంది. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి చూస్తే... ‘మీరు గ్రూపు నుంచి ఎగ్జిట్‌ (Exit) అయిపోయారు’ అంటూ ఓ మెసేజ్‌ కనిపిస్తోంది. దాంతో యూజర్లు తికమకపడుతున్నారు. ‘నాకు తెలియకుండా నేనెలా ఎగ్జిట్‌ అవుతాను’ అంటూ ఆలోచనలో పడుతున్నారు. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ (WhatsApp Desktop) వాడుతున్నవారికే ఈ సమస్య ఉంటోంది. ఈ సమయంలో మొబైల్‌లో ఆ గ్రూపు ఓపెన్‌ చేసి చూస్తే.. సభ్యుడిగానే ఉంటున్నారు. దీంతో ఏమైందో అర్థం కాక కంగారుపడుతున్నారు. 

ఇలా చేయండి

వాట్సాప్‌ గ్రూపు బగ్‌ గురించి మెటా (Meta) నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సులువుగా బయటపడొచ్చు అని చెబుతున్నారు టెక్‌ నిపుణులు. వాట్సాప్‌ వెబ్‌ను ఒకసారి లాగ్‌ అవుట్‌ చేసి మళ్లీ లాగ్‌ ఇన్‌ చేస్తే సమస్య ఫిక్స్ అవుతోంది. అలా సమస్య తీరని పక్షంలో మరోసారి ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. మీకూ ఇలాంటి సమస్యే వస్తోందా .. అయితే ఓసారి లాగ్‌ అవుట్‌ చేసి, లాగ్‌ ఇన్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని