WhatsApp: వాట్సాప్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు.. నచ్చిన భాషలోకి మారిపోవచ్చు!

ఇతర లాంగ్వేజ్‌లోనూ వాట్సాప్‌ వాడాలనుకునేవారి కోసం కొత్తగా లాంగ్వేజ్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేయనుంది.. 

Updated : 11 May 2022 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌ చాట్‌లో ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి గ్రూప్‌ పోల్స్‌ ఫీచర్‌తో పాటు లాంగ్వేజ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మరి ఆ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం..


పోల్స్‌ ఇన్‌ వాట్సాప్‌ గ్రూప్స్‌..

వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌ గ్రూపుల్లో పోలింగ్‌ నిర్వహించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి పోల్స్‌ ఫీచర్‌ పనిచేయనుంది. గ్రూప్‌ చాట్‌లో మెసేజ్‌రూపకంగా పోలింగ్ నిర్వహిస్తారు. పోల్‌ను క్రియేట్ చేయడానికి ముందు ఒక ప్రశ్నను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత, యూజర్లు ఓటు వేయడానికి మల్టీపుల్‌ ఆప్షన్స్‌ ఇవ్వాలి. వీటిలో ఏదో ఒక సమాధానాన్ని యూజర్‌సెలక్ట్‌ చేసుకొని ఓటు వేయాలి. యూజర్‌ ఇచ్చిన సమాధానాలను ఇతర గ్రూపు సభ్యులు చూడటానికి వీలు లేకుండా ఎండ్‌ టూ ఎండ్‌ ఇన్‌క్రిప్షన్‌ భద్రత ఉంటుంది. మెంబర్లు సెలక్ట్ చేసిన ఆప్షన్‌ను బట్టి పోల్ రిజల్ట్స్ వెలువడతాయి. కాగా, గ్రూప్ అడ్మిన్‌లు పోల్ ఆప్షన్‌లను సవరించగలరా? లేదా? పోలింగ్‌కు టైం లిమిట్‌ ఉంటుందా అనే వివరాలపై స్పష్టత లేదు. ఈ ఫీచర్‌ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని సమాచారం.


లాంగ్వేజ్‌ ఫీచర్‌..

వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లోనే అందుబాటులో ఉంది. తాజాగా ఇతర భాషల్లోనూ యాప్‌ను ఉపయోగించుకునేలా కొత్తగా లాంగ్వేజ్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ను ముందుగా ఆండ్రాయిడ్‌ 2.22.9.13 వెర్షన్‌ వాడే బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సెట్టింగ్‌లోకెళ్లి యూజర్లకు కావాల్సిన లాంగ్వేజ్‌ను సెలక్ట్‌ చేసుకునేలా ఈ ఫీచర్‌ పనిచేయనుంది. అయితే, ఇందులో ఎన్ని లాంగ్వేజెస్‌ ఉంటాయనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవేకాకుండా.. మ్యానేజ్‌ రియాక్షన్‌ నోటిఫికేషన్స్‌ సెట్టింగ్స్‌, కమ్యూనిటీ ట్యాబ్స్‌, ఇంటర్‌ఫేస్‌ వాయిస్‌ కాల్స్‌ వంటి ఫీచర్లను తీసుకురావాలని వాట్సాప్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్‌ కాల్‌లో ఒకేసారి 32 మంది మాట్లాడుకునేందుకు, 2 జీబీ పరిమాణంలోని ఫైళ్లను షేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వాట్సాప్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని