WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. టైమ్ లిమిట్ లేదు.. ఆ చాట్స్ ఎప్పుడైనా చదవచ్చు..ఇంకా!
వాట్సాప్ కొత్తగా మరిన్ని యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ను పరిచయం చేయనుంది. మరి ఆ ఫీచర్లేంటి.. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వాట్సాప్ మెసేజింగ్ యాప్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. గ్రూప్ కాలింగ్, వాట్సాప్ పేమెంట్స్, డిలీట్ ఫర్ ఎవ్రీవన్, వాయిస్ మెసేజ్, మల్టీ-డివైజ్ సపోర్ట్, ఫొటో ఎడిట్, వ్యూ వన్స్ వంటి ఎన్నో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. మరి వాట్సాప్ తీసుకొస్తున్న ఆ కొత్త ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..!
నో టైమ్ లిమిట్ (No Time Limit To Delete Messages)
ఇతరులకు పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులున్నా లేదా మార్పులు చేయాలన్నా సదరు మెసేజ్‌ను వెంటనే తొలగించేందుకు వీలుగా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone) అనే ఫీచర్ ఉంది. దీంతో మనం పంపిన మెసేజ్‌ను 1 గంట 8 నిమిషాలు 16 సెకన్ల వరకు తమ చాట్ పేజీతోపాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి డిలీట్ చేయొచ్చు. కొద్ది వారాల క్రితం ఈ టైమ్ లిమిట్‌ను రెండు రోజుల 12 గంటలకు పెంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. తర్వలో ఈ టైమ్ లిమిట్‌ను తొలగించనున్నట్లు సమాచారం. అంటే యూజర్ పంపిన మెసేజ్‌ను ఎలాంటి టైమ్ లిమిట్ లేకుండా ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చన్నమాట.
ఏడాదికోసారి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ (Terms of Services)
వాట్సాప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో కూడా మార్పులు చేయనుంది. ఈ మేరకు టర్మ్స్ ఆఫ్ సర్వీస్‌లో మార్పులు చేసిన ప్రతిసారీ యూజర్‌కు తెలిసేలా ఆ సెక్షన్ పక్కన చిన్న గ్రీన్ డాట్ కనిపిస్తుంది. అలానే టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ గురించి ఏడాదికోసారి యూజర్‌కు గుర్తుచేసేందుకు ఇయర్లీ రిమైండర్ ఆఫ్ అవర్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ (Yearly Reminder of Our Terms of Services) పేరుతో కొత్త ఆప్షన్ తీసుకురానుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.
రీడ్ లేటర్ (Read Later)
వాట్సాప్ ఆర్కైవ్ ఫీచర్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ఆర్కైవ్ పేరును రీడ్ లేటర్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్కైవ్ చేసిన చాట్ పేజ్ అన్నింటికంటే కిందకు వెళ్లిపోయేది. ఏదైనా కొత్త మెసేజ్ వస్తే తిరిగి చాట్ పేజ్‌లో పైన కనిపించేది. ఈ ఫీచర్లో కూడా వాట్సాప్ మార్పులు చేసింది. ఆర్కైవ్ చేసిన చాట్ పేజీలలో కొత్త మెసేజ్‌లు వచ్చిన యూజర్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా అవి ప్రత్యేక ఫోల్డర్లో ఉండిపోతాయి. దీంతో యూజర్స్ తమకు నచ్చినప్పుడు ఆర్కైవ్ ఫోల్డర్ ఓపెన్ చేసి అందులోని మెసేజ్‌లను చూసుకోవచ్చు.
గ్రూప్ పోల్స్ (Group Polls)
ఇతర మెసేజింగ్ యాప్‌లకు దీటుగా వాట్సాప్ కూడా గ్రూప్ పోల్స్ ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనుంది. దీంతో యూజర్స్ తమకు నచ్చిన అంశం గురించి ఇతరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోల్‌ను క్రియేట్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో పోల్ నిర్వహించాలనుకున్న యూజర్ ప్రశ్నతోపాటు యూజర్స్ ఓటు వేసేందుకు వీలుగా సమాధానాలను ఇవ్వాల్సి ఉంటుంది. గ్రూప్‌లో ఉన్న సభ్యులు మాత్రమే ఈ పోల్‌లో పాల్గొనగలరు. అయితే ఈ పోల్ నిర్వహణలో గ్రూప్ అడ్మిన్లకు ఎలాంటి అధికారాలు ఉంటాయనే దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కమ్యూనిటీస్ (Communities)
వాట్సాప్‌లోని గ్రూప్స్‌కు భిన్నంగా కమ్యూనిటీ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. గ్రూప్ అడ్మిన్ తరహాలోనే కమ్యూనిటీలను నిర్వహించే వారిని కమ్యూనిటీ మేనేజర్స్ అని పిలుస్తారు. అలానే కమ్యూనిటీస్లోనే వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి ఎండ్-టు-ఎండ్ భద్రత ఉంటుంది. వాట్సాప్ గ్రూప్స్‌లోలానే కమ్యూనిటీస్‌లో కూడా ఇతరులను ఇన్వైట్ లింక్, క్యూఆర్ కోడ్ లేదా మాన్యువల్‌గా ఆహ్వానించవచ్చు. అయితే, కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్‌లకు మెసేజ్ పంపలేరు. అలానే ఇతర సభ్యులతో సంభాషించాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
మెసేజ్ రియాక్షన్స్ (Message Reations)
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫొటోలతో మెసేజ్ రూపొందించినట్లుగానే వాట్సాప్‌లో కూడా ఫొటోలతో మెసేజ్ పంపేందుకు వీలుగా మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్లో వేర్వేరు ఎమోజీలు ఉంటాయి. వాటిలో యూజర్ తనకు నచ్చిన ఎమోజీతో మెసేజ్‌లకు రిప్లై ఇవ్వవచ్చు. ఈ ఫీచర్ వ్యక్తిగత చాట్ యూజర్లతో పాటు గ్రూప్స్ యూజర్స్‌కు కూడా అందుబాటులో ఉంటుంది.
హైడ్ లాస్ట్ సీన్ (Hide Last Seen From Specific Contacts)
వాట్సాప్‌లో మనం చివరిగా ఎప్పడు చూశామనేది ఇతరులకు తెలియకుండా ఉండేందుకు హైడ్ లాస్ట్ సీన్ ఫీచర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఎనేబుల్ చేస్తే వాట్సాప్ చాట్ పేజీలో ఉన్న యూజర్స్ అందరికీ చివరగా ఎప్పుడు చూశామనేది తెలియదు. అలాకాకుండా ఎవరో ఒకరు లేదా ఇద్దరు యూజర్స్‌కు తెలియకుండా మిగిలిన వారికి తెలిసేలా లాస్ట్ సీన్ ఆప్షన్లో వాట్సాప్ మార్పులు చేయనుంది. దీంతో మీ లాస్ట్‌సీన్ చూడకూడదనుకునే కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేసి మిగిలిన వారు చూసేలా డిసేబుల్ చేయొచ్చు.
గ్రూప్ అడ్మిన్స్‌కు కొత్త ఫీచర్ (Group Admins)
కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసే పోస్టులు గ్రూప్ అడ్మిన్లను చిక్కుల్లో పడేస్తుంటాయి. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను గ్రూప్ నుంచి డిలీట్ చేయగలడు. దీనికి చెక్ పెడుతూ గ్రూప్ అడ్మిన్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో గ్రూప్‌లో షేర్ చేసే పోస్టులను అడ్మిన్లు డిలీట్ చేయొచ్చు. అభ్యంతరకరమైన మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేస్తే.. గ్రూప్ చాట్ పేజీలో ‘గ్రూప్ అడ్మిన్ దాన్ని తొలగించారు’ అనే మెసేజ్ కనిపిస్తుంది. గ్రూప్‌కు ఒకరికి మించి ఎక్కువమంది అడ్మిన్లుగా ఉన్నా.. ఈ ఫీచర్‌తో వారందరూ మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు.
డాక్యుమెంట్ ప్రివ్యూ (Document Preview)
వాట్సాప్‌లో ఫొటో, వీడియోలను ఇతరులకు షేర్ చేసేముందు ప్రివ్యూ ఫీచర్‌తో వాటిని జాగ్రత్తగా పరిశీలించి తర్వాత పంపుతాం. ఇక మీదట వాట్సాప్‌లో పంపే పీడీఎఫ్ లేదా వర్డ్ డాక్యుమెంట్స్‌ను కూడా ఫొటో, వీడియోలను తరహాలోనే ప్రివ్యూలో చూడొచ్చు. ఇవేకాకుండా వాయిస్ కాలింగ్‌కు కొత్త ఇంటర్ఫేస్, చాట్ పేజ్ ఆప్షన్స్‌లో ఉండే సెర్చ్‌బార్‌ను వీడియో కాలింగ్ ఐకాన్ పక్కకు మార్చడం, బ్రాడ్కాస్ట్ లిస్ట్, న్యూ గ్రూప్ ఆప్షన్లను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి న్యూ చాట్ సెక్షన్లోకి మారనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ