
WhatsApp: ఈసారి ఐవోఎస్ యూజర్ల కోసం.. వాట్సాప్ కొత్త ఫీచర్లు
ఇంటర్నెట్ డెస్క్: సరికొత్త ఫీచర్లతో ఎప్పుడూ ముందుండే ప్రముఖ మెసేంజర్ వాట్సాప్ మరో అడుగు ముందుకేసింది. ఐవోఎస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని మరో రెండు కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారుల (బీటా యూజర్లు)కు మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ వాట్సాప్ పరిచయం చేయనుంది.
ఇందులో మొదటిది వాయిస్ మెసేజ్ పాజ్-అండ్-రెస్యూమ్/ప్లే ఫీచర్. ఈ ఫీచర్‌ను ఇప్పటికే డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ పరిచయం చేసింది. తాజాగా పాజ్, రెజ్యూమ్ బటన్‌లతో మరింత డైనమిక్‌గా అప్‌డేట్ ఫీచర్‌ను ఐవోఎస్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు పాజ్, రెజ్యూమ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వాయిస్ రికార్డింగ్ బటన్‌ను పైకి స్వైప్ చేయాల్సి ఉంటుంది.
ఇక రెండో ఫీచర్ న్యూ ఫోకస్ మోడ్. పనిలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్లు చిరాకు తెప్పిస్తుంటాయి. వాటిలో ఏది ముఖ్యమైనదో గమనించకుండానే అన్నింటినీ అలాగే వదిలేస్తాం. దీనికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఫోకస్ మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యమైన వ్యక్తులు, గ్రూప్‌ల నుంచి మాత్రమే మెసేజ్ నోటిఫికేషన్ వచ్చేలా ఈ కొత్త ఫీచర్ అనుమతి ఇవ్వనుంది. మరోవైపు ఐవోఎస్ వినియోగదారుల కోసం మెసేజ్‌తో పాటు యూజర్ ప్రొఫైల్ ఫొటో (డీపీ)ను నోటిఫికేషన్‌పై ప్రదర్శించేలా వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను ప్రారంభించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.