WhatsApp: ఒక్క స్వైప్‌తో వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్!
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను చడీచప్పుడు లేకుండా తీసుకొచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మీద చాట్స్, స్టేటస్, కాల్స్ అనే మూడు సెక్షన్లు మాత్రమే కనిపించేవి. తాజా అప్డేట్లో చాట్స్‌కు ఎడమవైపు కెమెరా ఐకాన్ యాడ్ అయింది...
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ కోసం ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. చాలామందికి వాట్సాప్‌లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి పూర్తి అవగాహన ఉండదు. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చే ఫీచర్లలో కొన్నింటికి ప్రచారం చేస్తే, మరికొన్నింటిని సైలెంట్‌గా పరిచయం చేస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను చడీచప్పుడు లేకుండా తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫీచర్ అనేగా మీ సందేహం?అదేనండీ.. చాట్ పేజీలో కెమెరా ఆప్షన్. ఇప్పటివరకు వాట్సాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్ మీద చాట్స్, స్టేటస్, కాల్స్ అనే మూడు సెక్షన్లు మాత్రమే కనిపించేవి. తాజా అప్డేట్లో చాట్స్‌కు ఎడమవైపు కెమెరా ఐకాన్ యాడ్ అయింది. చాట్ పేజ్ని కుడివైపు స్వైప్ చేయడం లేదా కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేస్తే వాట్సాప్‌లో కెమెరా ఆప్షన్ వస్తుంది. దీంతో మీకు కావాల్సిన ఫొటోను క్లిక్‌మనిపించి స్టేటస్‌గా వాడుకోవచ్చు, ఇతరులతో షేర్ చేయొచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్‌లో కెమెరా యాక్సెస్ చేయాలంటే ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేయడం లేదా స్టేటస్ పేజ్‌లోకి వెళ్లి కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాల్సిందే. తాజా అప్డేట్తో కెమెరాను సులువుగా యాక్సెస్ చేయొచ్చు. గతంలో ఈ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.
కొద్దిరోజుల క్రితం వాట్సాప్ కొత్తగా మూడు ప్రైవసీ అప్డేట్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి ఫీచర్‌తో వాట్సాప్ గ్రూప్‌లోంచి ఇతర సభ్యులకు తెలియకుండా వెళ్లిపోవచ్చు. కేవలం అడ్మిన్లకు మాత్రమే గ్రూప్ నుంచి వెళ్లిపోయిన వారి వివరాలు కనిపిస్తాయి. రెండో ఫీచర్లో యూజర్లు ఆన్లైన్లో ఒకరితో ఛాట్ చేస్తున్నప్పుడు, మరొకరికి తమ ఆన్లైన్ స్టేటస్ కనపడకుండా లైవ్ స్టేటస్ ఎవరెవరు చూడొచ్చనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. ఇక మూడో ఫీచర్‌తో వ్యూవన్స్‌లో స్క్రీన్‌షాట్ తీసుకోవడం సాధ్యంకాదు. వాట్సాప్‌లో ఏదైనా మీడియాఫైల్‌ను షేర్ చేసినప్పుడు ఒకసారే చూసే విధంగా వ్యూవన్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పంపిన ఫొటోలను చాలామంది స్క్రీన్‌షాట్ తీస్తుండటంతో వ్యూవన్స్ ఉపయోగంలేకుండా పోతోందట. ఇకపై వ్యూవన్స్ ద్వారా పంపే ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకునే వీల్లేకుండా అప్డేట్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..