WhatsApp: మిస్డ్‌కాల్‌ అప్‌డేట్‌తో వాట్సాప్‌ డీఎన్‌డీ మోడ్‌!

వాట్సాప్‌ త్వరలో డు నాట్‌ డిస్ట్రబ్‌ మోడ్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు తమకు ఎవరు మెసేజ్‌/కాల్ చేశారనేది తెలియదు. వాట్సాప్‌ కొత్తగా తీసుకొస్తున్న అప్‌డేట్‌తో  ఈ సమస్యకు చెక్ పెట్టనుంది. 

Updated : 14 Nov 2022 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్‌ (WhatsApp) ఉపయోగించేలా కంపానియన్‌ మోడ్‌ (Companion Mode)ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. దీంతోపాటు డు నాట్‌ డిస్ట్రబ్‌ (Do Not Disturb) మోడ్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం చేయనుంది. తాజాగా ఈ ఫీచర్‌లో మరో కీలక అప్‌డేట్‌ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్‌కు సాధారణ మిస్డ్‌కాల్ అలర్ట్ తరహా ఫీచర్‌ వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది. 

డీఎన్‌డీ మోడ్‌

ముఖ్యమైన పనికి కాల్‌/మెసేజ్/నోటిఫికేషన్లతో భంగం కలగకుండా ఉండేందుకు ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచుతాం. ఇదే తరహాలో వాట్సాప్‌ డీఎన్‌డీ మోడ్‌ పనిచేస్తుంది. యూజర్‌ ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత వాట్సాప్‌లో ఎలాంటి మెసేజ్‌/కాల్స్‌ వచ్చినా యూజర్‌కు కనిపించవు. దీంతో ఎవరు, ఎప్పుడు కాల్ చేశారనేది తెలియదు. కొత్త అప్‌డేట్‌లో మిస్డ్‌కాల్‌ వివరాలు యూజర్‌కు చాట్‌ స్క్రీన్‌పై కనిపిస్తాయి. డీఎన్‌డీ మోడ్ డిసేబుల్ చేసిన తర్వాత చాట్ స్క్రీన్‌లో.. ఉదాహరణకు missed voice/video call at 16:45 while on Do Not Disturb అని కనిపిస్తుంది. సాధారణ మిస్డ్‌కాల్ అలర్ట్ తరహాలో ఇది పనిచేస్తుంది.  ప్రస్తుతం డీఎన్‌డీ మోడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నారు. 

వీటితోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకురానుంది. వీటిలో వాయిస్‌ స్టేటస్‌, డాక్యుమెంట్ క్యాప్షన్‌, షార్ట్‌కట్‌ కెమెరా వంటివి ఉన్నాయి. వాయిస్‌ స్టేటస్‌తో ఆడియో మెసేజ్‌లను వాట్సాప్‌ స్టేటస్‌లో అందరూ వినేలా పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్‌ క్యాప్షన్‌ ఫీచర్‌లో యూజర్‌ ఇతరులకు పంపే ఫైల్స్‌ను నచ్చిన క్యాప్షన్‌తో పంపవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఆ ఫైల్స్‌ సెర్చ్‌ సులభమవుతుంది. షార్ట్‌కట్‌ కెమెరాతో సాధారణ ఫోన్‌ కెమెరా తరహాలో ఫొటో క్యాప్చరింగ్‌, వీడియో రికార్డింగ్ ఆప్షన్లు వాట్సాప్‌లో కనిపిస్తాయి. ప్రస్తుతం కెమెరా ఐకాన్‌పై క్లిక్‌ చేసి రెండు సెకన్లు క్యాప్చర్ బటన్‌ను హోల్డ్‌ చేస్తే వీడియో రికార్డ్‌ అవుతుంది. కొత్త అప్‌డేట్‌లో ఫొటో, వీడియో సెలక్షన్‌ కోసం వేర్వేరు మోడ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని