WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. మొబైల్‌కి ఆడియో స్టేటస్, డెస్క్టాప్కి అన్‌రీడ్ చాట్ ఫిల్టర్
వాట్సాప్గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయడంలో వాట్సాప్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కొత్తగా వాట్సాప్ స్టేటస్ అప్డేట్లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది...
ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఎన్ని వచ్చినా.. తర్వాత ఏం ఫీచర్ రాబోతుందనే ఆసక్తి యూజర్లలో ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయడంలో వాట్సాప్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మల్టీడివైజ్, 2జీబీ ఫైల్ షేరింగ్, వాయిస్ మెసేజ్ ఎడిట్, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ టైమ్ లిమిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్, 32 మందితో గ్రూప్ కాలింగ్ అంటూ దాదాపు పదికిపైగా కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. కొత్తగా వాట్సాప్ స్టేటస్ అప్డేట్లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది.
వాట్సాప్‌లో ఇప్పటి వరకు ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ను మాత్రమే స్టేటస్‌గా పెట్టుకునే వెసులుబాటు ఉండేది. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో యూజర్లు తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్తోపాటు, ఇతరులు పంపిన లేదా రికార్డు చేసిన వాయిస్ నోట్స్‌ను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఆడియో స్టేటస్ అప్డేట్ కోసం యూజర్లు స్టేటస్ బార్ ఓపెన్ చేస్తే ప్రస్తుతం ఉన్న కెమెరా, టెక్ట్స్ పీచర్లతోపాటు కొత్తగా మైక్ సింబల్ కనిపిస్తుంది. మైక్ సింబల్‌పై క్లిక్ చేసి ఆడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని స్టేటస్‌లో అప్డేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) వెల్లడించింది.
డెస్క్‌టాప్ యూజర్ల కోసం
దీంతోపాటు డెస్క్‌టాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో రోజుకి ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ముందు చదివేస్తుంటాం. దాంతో అంతకుముందు వచ్చిన మెసేజ్‌లు అన్‌రీడ్‌గా కాంటాక్ట్ బార్లో కిందకు వెళిపోతాయి. వాటిని తిరిగి చదివాలంటే కాంటాక్ట్ బార్‌ను కిందకు స్క్రోల్ చేయక తప్పదు. ఇకపై ఆ అవసరం లేకుండా వాట్సాప్ అన్‌రీడ్ చాట్ ఫిల్టర్ (Unread Chat Filter) అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు అన్‌రీడ్ జాబితా కోసం కాంటాక్ట్ బార్లో సెర్చ్ పక్కనే ఉన్న సింబల్‌పై క్లిక్ చేస్తే మీరు చదవని మెసేజ్‌లు కనిపిస్తాయి.
నచ్చిన ఎమోజీతో రియాక్షన్
వాట్సాప్ ఇటీవల పరిచయం చేసిన మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను కూడా అప్డేట్ చేయనుంది. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌తో యూజర్లు కేవలం ఆరు ఎమోజీలతో మాత్రమే రిప్లై ఇచ్చే వెసులుబాటు ఉంది. త్వరలో వీటికి అదనంగా వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలను ఉపయోగించుకునేలా ఈ ఫీచర్‌ను వాట్సాప్ అప్డేట్ చేయనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్ మెసేజ్ పక్కనే ఉన్న ఎమోజీ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆరు ఎమోజీలతోపాటు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్‌లోని ఏదైనా ఎమోజీతో మెసేజ్‌కు రిప్లై ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్‌లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్