WhatsApp: స్టేటస్‌ అప్‌డేట్‌లో వెబ్‌ లింక్‌ కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

వాట్సాప్‌ టెక్ట్స్‌ స్టేటస్‌ అప్‌డేట్ కోసం మరో కొత్త ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఆ ఫీచరేంటి..దాంతో యూజర్లకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాం. 

Published : 15 May 2022 21:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ మల్టీడివైజ్‌ ఫీచర్‌ అప్‌డేట్‌ చేసుకున్న తర్వాత చాలా మంది యూజర్లకు వెబ్‌ లింక్‌ ప్రివ్యూలో సమస్య తలెత్తింది. గతంలో మాదిరి వెబ్‌ లింక్‌ షేర్‌ చేస్తే ప్రివ్యూ రావడంలేదు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. తాజాగా వెబ్‌ లింక్‌ ప్రివ్యూకు సంబంధించి వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో టెక్ట్స్‌ స్టేటస్‌ అప్‌డేట్‌ కోసం వెబ్‌ లింక్‌ షేర్‌ చేస్తే..దానిపై క్లిక్ చేస్తే తప్ప, దానికి సంబంధించిన సమాచారం తెలిసేదికాదు. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో టెక్ట్స్‌ స్టేటస్‌ అప్‌డేట్‌లో వెబ్‌ లింక్‌ షేర్‌ చేస్తే దానికి సంబంధించిన సమాచారం లింక్‌పై క్లిక్ చేయకుండానే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు కూడా పరిచయం చేస్తారని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. 

ఇదేకాకుండా వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌లో కూడా స్వల్ప మార్పులు చేయనుందట. స్టేటస్‌ అప్‌డేట్‌ పేజ్‌లో ఎమోజీ, టెక్ట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ ఆప్షన్లను స్క్రీన్‌ కింది భాగం నుంచి తొలగించి, స్క్రీన్‌ పైభాగంలో కుడివైపు చివరన కనిపించేలా అప్‌డేట్ చేయనుందని తెలుస్తోంది. దీనితోపాటు డిస్‌అప్పియరింగ్ మెసేజెస్‌లో మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేయనుందని వాబీటాఇన్పో తెలిపింది. ఒకేసారి ఎక్కువ చాట్ సంభాషణలు డిస్‌అప్పియర్‌ అయ్యే విధంగా యూజర్‌కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి రానుంది. కొద్దిరోజుల క్రితం చాట్ ఫిల్టర్‌ అనే కొత్త ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో యూజర్లు తమకు కావాల్సిన చాట్‌ సంభాషణలను సులువుగా వెతకొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని