WhatsApp: మీడియా ఫైల్ షేరింగ్ కోసం మూడు ఆప్షన్లు

వాట్సాప్‌లో రోజూ మనం ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు ఇతరులతో షేర్ చేసుకుంటాం. వాటిలో కొన్ని సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల షేర్ చేయడం సాధ్యంకాదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు వాట్సాప్ త్వరలో అప్‌లోడ్ వీడియో క్వాలిటీ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే....

Published : 09 Jul 2021 23:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో రోజూ మనం ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు ఇతరులతో షేర్ చేసుకుంటాం. వాటిలో కొన్ని సైజ్ ఎక్కువగా ఉండటం వల్ల షేర్ చేయడం సాధ్యంకాదు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు వాట్సాప్ త్వరలో అప్‌లోడ్ వీడియో క్వాలిటీ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంత క్వాలిటీ వీడియోలను పంపాలనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. తాజాగా ఫొటో షేరింగ్ కోసం కూడా ఈ తరహా ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ఈ ఫీచర్‌లో కూడా వీడియో క్వాలిటీ ఫీచర్‌లోలానే ఆటో, బెస్ట్ క్వాలిటీ, డేటా సేవర్‌ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. యూజర్‌ ఫొటోలను పంపేప్పుడు వీటిలో ఒకదాన్ని ఎంచుకుంటే ఫొటో సైజ్ అందుకునుగుణంగా మారిపోతుంది. 

ఆటో ఆప్షన్ సాధారణ వీడియోలు, ఫొటోలు పంపేందుకు అనువుగా ఉంటుంది. ఇక హై-రిజల్యూషన్ కంటెంట్ పంపేందుకు బెస్ట్ క్వాలిటీ ఆప్షన్, క్వాలిటీ నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పుడు డేటా సేవర్ ఆప్షన్ ద్వారా వీడియోలు, ఫొటోలు షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురాన్నున్నట్లు సమాచారం. సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డేటా సెక్షన్‌లో వీడియో, ఫొటోలకు కలిపి ‘మీడియా అప్‌లోడ్ క్వాలిటీ’ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తారట.

వినియోగదారులకి మెరుగైన సేవలందించడంలో భాగంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూనే ఉంటుంది. ఇటీవలే ‘వ్యూ వన్స్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను బీటా వెర్షన్ యూజర్స్‌ కోసం విడుదల చేశారు. ఈ ఫీచర్‌ సాయంతో మనం పంపిన వీడియోలు, ఫొటోలను అవతలి వాళ్లు ఒక్కసారి ఓపెన్ చేసి, ఛాట్ విండో నుంచి బయటకు వచ్చిన తర్వాత డిలీట్ అయిపోతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని