WhatsApp: వాట్సాప్‌లో త్వరలో ‘కమ్యూనిటీ’ ట్యాబ్‌ ఫీచర్‌!

ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఒక చోట చేరి తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా వాట్సాప్‌ ‘కమ్యూనిటీ’ ట్యాబ్‌ ఫీచర్‌ను..

Updated : 11 May 2022 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఒక చోట చేరి తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా వాట్సాప్‌ ‘కమ్యూనిటీ’ ట్యాబ్‌ ఫీచర్‌ని తీసుకురానుంది. ఈ ఫీచర్‌పై ఇప్పటికే సన్నాహాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని త్వరలోనే ఆండ్రాయిడ్‌ 2.22,9.10 వెర్షన్‌, ఐఓఎస్‌ వాట్సాప్‌ బీటా యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాబీటాఇన్ఫో తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది.

కమ్యూనిటీ ట్యాబ్‌ ఫీచర్‌ ప్రస్తుతం ఉన్న కెమెరా షార్ట్‌కట్‌ ప్లేస్‌లో చాట్‌ స్క్రీన్‌కు ఎడమ వైపుగా ఉంటుందని సమాచారం. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ కమ్యూనిటీ లోపల కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది. ఫేస్‌బుక్‌లో ఉన్న మాదిరిగానే వాట్సాప్‌లోనూ ఈ కమ్యూనిటీ ఫీచర్ పనిచేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లకు భిన్నంగా ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉందని.. విడుదల కావడానికి కాస్త సమయం పడుతుందని వాబీటాఇన్ఫో పేర్కొంది.

కొత్తగా మూడు డ్రాయింగ్‌ టూల్స్‌..

వాట్సాప్‌లో ఫొటోలను ఎడిట్‌ చేసుకునేందుకు కొత్తగా మూడు డ్రాయింగ్‌ టూల్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాబీటాఇన్ఫో పేర్కొంది. ఇందులో రెండు పెన్సిల్‌ టూల్స్‌ మరొకటి బ్లర్‌ టూల్‌ ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పలువురు యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. కొద్ది రోజుల్లో యూజర్స్‌ అందరికీ పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు వాట్సాప్ 2.22.3.5 పేరుతో ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చినట్లు వాబీటాఇన్ఫో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు