WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లొస్తున్నాయ్... ఈలోపు ఓ లుక్కేయండి!
వాట్సాప్ వినియోగాన్ని సులభతంర చేయడంలో భాగంగా యూజర్లకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ పీచర్లేంటి, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డౌన్లోడ్లు కలిగిన ఏకైక మెసేజింగ్ యాప్ వాట్సాప్. మెసేజింగ్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు ఎన్నో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. గత కొంతకాలంగా వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇతర యాప్‌లకు దీటుగా వరుస కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్స్‌ను ఆకర్షిస్తోంది. డేటా గోప్యతకు ఎన్క్రిప్షన్ భద్రత, డేటా స్టోరేజ్‌కు క్లౌడ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండటంతో అధికారిక సమాచార మార్పిడికి ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. మరి త్వరలో వాట్సాప్ యూజర్స్‌కు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. ఆ ఫీచర్లేంటి? వాటితో యూజర్లకు ఎలాంటి ఫీచర్లు అందుబాటులోకి వస్తాయో తెలుసుకుందాం.
మరింత సమయం
డిలీట్ ఫర్ ఎవ్రీవన్.. గతంలో మనం పంపిన మెసేజ్‌లో ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరి చేసేందుకు అవకాశం ఉండేది కాదు. తప్పును వివరిస్తూ మరో మెసేజ్ పంపాల్సిందే. దీంతో యూజర్స్ సమయం, డేటా, స్టోరేజ్ వృధా అయ్యేవి. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగానే వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. అంటే యూజర్ మెసేజ్ పంపిన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలో వాటిని డిలీట్ చేస్తే అవతలి వ్యక్తి వాటిని చూడలేరు. గతంలో డిలీట్ మెసేజ్‌లో కాల పరిమితి 7 నిమిషాలు మాత్రమే ఉండేది. తర్వాత దాన్ని 1 గంట 8 నిమిషాలు 16 సెకన్లుకు పొడిగించారు. త్వరలో ఈ కాలపరిమితిని రెండు రోజుల 12 గంటలకు (రెండున్నర రోజులు) మార్చనున్నారు. అంటే మెసేజ్ పంపిన రెండున్నర రోజుల తర్వాత కూడా యూజర్స్ చాట్ పేజీల నుంచి డిలీట్ చేయొచ్చు.
డెస్క్‌టాప్ యూజర్లకు..
రిక్వెస్ట్ రిపోర్ట్
గతేడాది ఫేస్బుక్ అనుబంధ సంస్థలు యూజర్ల నుంచి డేటా సేకరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాట్సాప్ కూడా డేటా సేకరిస్తుందనే సందేహాన్ని పలువురు యూజర్స్ వ్యక్తం చేశారు. అయితే వాట్సాప్‌లో యూజర్ డేటాకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ భద్రత ఉంటుందని, యూజర్ మినహా దాన్ని ఎవరూ చూడలేరని వాట్సాప్ పేర్కొంది. దీంతో యూజర్లకు మరింత పారద్శకమైన సేవలను అందించడం కోసం వాట్సాప్ రిక్వెస్ట్ రిపోర్ట్ ఫీచర్‌ను డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్స్ తమ ఖాతా లాగిన్ వివరాలు, ప్రైవసీ సెట్టింగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
టూ-స్టెప్ వెరిఫికేషన్
సైబర్ నేరగాళ్ల నుంచి యూజర్స్‌కు భద్రత కల్పించేందుకు సోషల్ మీడియా, మెయిల్ సేవలను అందించే సంస్థలు టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాయి. తాజాగా వాట్సాప్ కూడా డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్లకు టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఫీచర్ యాప్ వెర్షన్లో ఉంది. దీని కోసం సెట్టింగ్స్‌లో అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుని ఉపయోగించవచ్చు. డెస్క్‌టాప్ యూజర్లకు పరీక్షల అనంతరం అందుబాటులోకి రానుంది.
నోటిఫికేషన్లో డీపీ
వాట్సాప్ మెసేజ్ వచ్చిన వెంటనే ఫోన్ లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ లేదా నోటిఫికేషన్ సెంటర్లో కనిపిస్తుంది. ఒకవేళ మెసేజ్ పంపిన వారి నంబర్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉంటే పేరు కనిపిస్తుంది. అదే కొత్త నంబర్ నుంచి మెసేజ్ వస్తే ఎవరు పంపారో తెలుసుకునేందుకు మెసేజ్ ఓపెన్ చేయాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ మెసేజ్ పంపిన వారి డీపీ/ప్రొఫైల్ ఫొటో నోటిఫికేషన్లో కనిపిస్తుంది. దాంతో నంబర్ సేవ్ చేసుకోకున్నా మెసేజ్ ఎవరు పంపారో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.
అవి మారుతున్నాయి
వాట్సాప్ వినియోగాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా యూజర్ ఇంటర్ఫేస్ (యూఐ)లో కూడా మార్పులు చేయనుంది. ఇందుకోసం వాట్సాప్ చాట్ విండోలోని చాట్ లిస్ట్ నుంచి బ్రాడ్కాస్ట్ లిస్ట్, న్యూ గ్రూప్ ఆప్షన్లను తొలగించి, న్యూ చాట్ ఆప్షన్లో చేర్చనుంది. ఈ ఫీచర్ అప్డేట్ తర్వాత యూజర్ న్యూ చాట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో సెర్చ్‌బార్ పైన బ్రాడ్కాస్ట్ లిస్ట్, కింద న్యూ గ్రూప్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాట్సాప్‌లో ఒకేసారి ఎక్కువ మందికి ఒకే మెసేజ్ పంపేదుకు బ్రాడ్కాస్ట్ లిస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఒకే అభిప్రాయం కలిగినవారు చర్చించుకునేందుకు, అభిప్రాయాలు పంచుకునేందుకు గ్రూప్ క్రియేట్ చేసి అందులో సంభాషించవచ్చు.
ఐమెసేజ్ తరహాలో
యాపిల్ ఐమెసేజ్ తరహాలో వాట్సాప్ మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. మెసేజ్ రియాక్షన్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచరతో యూజర్స్ వాట్సాప్ మెసేజ్‌లకు ఎమోజీ, స్టిక్కర్లతో రిప్లై ఇవ్వవచ్చు. దీనికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ కూడా ఉంటుంది. ఫీచర్ అందుబాటులోకి వచ్చాక, యూజర్స్ మెసేజ్ మీద టచ్ చేస్తే ఎమోజీ రిప్లై ఆప్షన్ కనిపిస్తుంది. అందులో నచ్చిన ఎమోజీ లేదా స్టిక్కర్‌ను సెలెక్ట్ చేసి రిప్లై ఇవ్వవచ్చు.
ఐపాడ్ అభిమానులకు
ఇప్పటి వరకు ఐపాడ్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వెబ్ వెర్షన్ మినహా మరో ఆప్షన్ లేదు. అయితే ఇందులో లాగిన్ కావాలంటే తప్పనిసరిగా మొబైల్ నుంచి డివైజ్ లింక్ చేయాల్సిందే. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్ ఐపాడ్ యాప్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇటీవలే దీనిపై వాట్సాప్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ స్పష్టతనిచ్చారు. ఇందులో ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ తరహాలో మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ ఉంటుందని తెలిపారు.
ఆడియో మెసేజ్ అప్డేట్
వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో రెండు కీలక అప్డేట్లను యూజర్లకు పరిచయం చేయనుంది. పాజ్-అండ్-రెజ్యూమ్/ప్లే (Pause-And-Resume/Play) పేరుతో తీసుకొస్తున్న ఫీచర్‌తో యూజర్స్ ఆడియో మెసేజ్ పంపేప్పుడు, రికార్డు చేసిన ఆడియోను విని అందులో ఏవైనా తప్పులుంటే దాన్ని డిలీట్ చేసి కొత్త ఆడియోను రికార్డు చేసి పంపొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను యాప్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
అలానే వాట్సాప్ తీసుకొస్తున్న మరో ఆడియో అప్డేట్తో యూజర్స్ ఆడియో మెసేజ్ వింటూ యూజర్లతో చాట్ చేయొచ్చు. ప్రస్తుతం ఆడియో మెసేజ్ ప్లే చేసి మరో చాట్ విండో ఓపెన్ చేస్తే ఆడియో ఆగిపోతుంది. కానీ, కొత్త అప్డేట్తో ఆడియో ప్లే చేస్తే వేరే యూజర్ చాట్ పేజ్ ఓపెన్ చేస్తే ఆడియో ఆగిపోకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం