WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుండటంతో వాట్సాప్‌ (WhatsApp) మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ ద్వారా మహిళ కోసం మరో చాట్‌బోట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Published : 27 Jun 2022 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుండటంతో వాట్సాప్‌ (WhatsApp) మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. సమాచార మార్పిడి నుంచి ఆన్‌లైన్ పేమెంట్, షాపింగ్‌ వరకు ఎన్నో రకాల సేవలు వాట్సాప్‌ ద్వారా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్‌, మెడికల్‌ రంగాలతోపాటు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ సంస్థలు కూడా చాట్‌బాట్‌ (Chatbot)ల సాయంతో వాట్సాప్‌ ద్వారా యూజర్లు తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా వాట్సాప్‌ ద్వారా మహిళ కోసం మరో చాట్‌బాట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్‌ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (Sirona Hygiene Pvt. Ltd) అనే సంస్థతో కలిసి వాట్సాప్‌ ఈ సేవలను ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. 

వాట్సాప్‌ ద్వారా ఈ చాట్‌బాట్‌ నెలసరి ట్రాకింగ్‌, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలను మహిళలకు అందిస్తోంది. ఈ సేవలను ఉపయోగించుకునేందుకు మహిళలు ముందుగా నెలసరికి సంబంధించిన కొంత ప్రాథమిక సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన సమాచారాన్ని చాట్‌బోట్‌ రికార్డు చేసి కచ్చితమైన నెలసరి తేదీని యూజర్‌కు తెలియజేస్తుంది. అంతేకాకుండా యూజర్‌కు ముందుగానే నెలసరి తేదీకి సంబంధించి రిమైండర్‌ను పంపుతుంది. ఈ సేవల కోసం యూజర్లు +919718866644 అనే నంబర్‌కు హాయ్‌ (Hi) అని మెసేజ్‌ చేయాలి. తర్వాత చాట్‌బోట్ చూపించే మూడు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని, ప్రాథమిక వివరాలు నమోదు చేసి సేవలను పొందవచ్చు. రోజువారీ జీవితంలో అంతర్భాగమైన వాట్సాప్‌ ద్వారా మహిళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సిరోనా హైజెనీ సంస్థ వెల్లడించింది. దీని ద్వారా మహిళలు మరింత సులువుగా తమ నెలసరికి సంబంధించిన సమాచారాన్ని పొందగలరని సంస్థ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని