WhatsApp: వాట్సాప్‌లో పోలింగ్‌.. ఎలా నిర్వహించాలంటే?

వాట్సాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు పోల్‌ నిర్వహించవచ్చు. ఇది గ్రూప్‌లకు బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ చెబుతోంది. మరి, ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. 

Updated : 17 Nov 2022 21:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  వాట్సాప్‌ (WhatsApp) యూజర్లు ఎంతోకాలంగా వేచిచూస్తోన్న పోల్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా విషయంపై గ్రూప్‌ సభ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు పోల్‌ (Poll) ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. మరి, ఈ ఫీచర్‌ ఎక్కడ ఉంటుంది? ఎలా పనిచేస్తుందో చూద్దాం. 

వాట్సాప్‌ పోల్‌ ఫీచర్‌ కోసం గ్రూప్‌ లేదా యూజర్ చాట్‌ పేజీలో అటాచ్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే పోల్‌ అని ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే క్రియేట్ పోల్ ఓపెన్‌ అవుతుంది. అందులో ప్రశ్న, జవాబులకు సంబంధించిన సెక్షన్లు కనిపిస్తాయి. వాటిలో ప్రశ్న, జవాబులుగా ఇవ్వాలనుకుంటున్న ఆప్షన్లు టైప్‌ చేసి సెండ్‌ చేయాలి. కనిష్ఠంగా రెండు, గరిష్ఠంగా 12 ఆప్షన్లను జవాబులుగా ఇవ్వొచ్చు. తర్వాత గ్రూప్‌ సభ్యులు తమకు నచ్చిన ఆప్షన్‌కు ఓటు వేస్తారు. ఏ జవాబుకు ఎన్ని ఓట్లు వచ్చాయనేది కింద వ్యూ ఓట్స్‌ (View Votes)పై క్లిక్ చేసి చూడొచ్చు. ఈ ఫీచర్‌తో గ్రూప్‌లకు బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్‌ చెబుతోంది. కానీ, ఇందులో ఒక యూజర్‌ ఒకటి కంటే ఎక్కువ జవాబులకు ఓటు వేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ఆప్షన్‌ ఇలాగే కొనసాగుతుందా? లేక ఒక జవాబు మాత్రమే ఓటు వేసేలా మార్పులు చేస్తారా? అనేది తెలియాల్సివుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని