Published : 09 Nov 2021 13:50 IST

WhatsApp: వాట్సాప్ సెక్యూరిటీ కోడ్‌ నోటిఫికేషన్‌తో విసిగిపోయారా.. ఇలా ఆపేయండి! 

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన మల్టీడివైజ్‌ ఫీచర్‌ అప్‌డేట్‌ వచ్చిన తర్వాత కూడా తమ ఫోన్లలో సెక్యూరిటీ కోడ్ ఛేంజ్‌డ్‌ అనే మెసేజ్‌ ఎక్కువగా కనిపిస్తోందని చాలా మంది యూజర్స్‌ చెబుతున్నారు. అయితే వాట్సాప్‌ యాప్‌ని యూజర్‌ అప్‌డేట్ చేసినా, యాప్‌కి కొత్త ఫీచర్‌ వచ్చినా లేదా కొత్త ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసినా సెక్యూరిటీ కోడ్‌లు మారుతుంటాయని వాట్సాప్‌ తెలిపింది. మల్టీడివైజ్‌ ద్వారా ప్రస్తుతం ఉపయోగిస్తున్న డివైజ్‌ కాకుండా మరో మూడు డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించుకునే వీలుంటుంది. అంటే మరో మూడు కొత్త డివైజ్‌లు మీ వాట్సాప్ ఖాతాలో చేరినట్లే. దీంతో కొత్త డివైజ్‌లలో వాట్సాప్ లాగిన్ అయినప్పుడు సెక్యూరిటీ కోడ్‌ మారుతాయని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. దీని గురించి యూజర్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అలానే ప్రైమరీ డివైజ్‌ నుంచి మల్టీడివైజ్‌ జాబితాలో ఉన్న డివైజ్‌లను తొలగించినా సెక్యూరిటీ కోడ్ మారుతుంది. అలాంటి సందర్భంలో యూజర్‌కి నోటిపికేషన్‌ ద్వారా వాట్సాప్‌ యూజర్‌కి తెలియజేస్తుంది.

వాట్సాప్‌లో మనం చేసే చాటింగ్‌లో ప్రతి చాట్‌కీ ప్రత్యేకమైన సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఇది ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సదరు మెసేజ్‌లను వెరిఫై చేసి వాటిని ఇతరులు యాక్సెస్‌ చేయకుండా రక్షణ  కల్పిస్తుంది. యూజర్స్ ఈ సెక్యూరిటీ కోడ్‌ని కాంటాక్ట్ ఇన్ఫోలో చూడొచ్చు. మీ వాట్సాప్‌ పేజ్‌లో ఏదైనా కాంటాక్ట్‌ పేరు లేదా ఫొటోపై క్లిక్ చేయాలి. తర్వాత కింద జాబితాలో మీకు ఎన్‌క్రిప్షన్ అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు వెరిఫై సెక్యూరిటీ కోడ్ అనే విండో ఓపెన్ అవుతుంది. అందులో మీకు క్యూఆర్ కోడ్, 60 నంబర్ల కనిపిస్తాయి. వాటిని మీరు మీ మొబైల్‌లో ఓపెన్‌ చేసిన యూజర్‌ కూడా తన మొబైల్‌లో కూడా ఓపెన్ చేసి ఎన్‌క్రిప్షన్‌లో నంబర్స్‌, మీ ఫోన్‌లో సదరు కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ వెరిఫై సెక్యూరిటీలో కనిపించే నంబర్స్‌తో సరిపోలితే మీ మధ్య చాట్‌ సంభాషణ పూర్తిగా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అయినట్లేనని వాట్సాప్ చెబుతోంది. ఒకవేళ సెక్యూరిటీ కోడ్‌ మారినట్లు మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మీరు ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌పై క్లిక్ చేయాలి. అందులో సెక్యూరిటీ ఓపెన్ చేసి షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. అప్పుడు మీకు మీ వాట్సాప్‌ కాంటాక్ట్‌ జాబితాలోని ఎవరి సెక్యూరిటీ కోడ్ మారినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీకు సెక్యూరిటీ కోడ్‌ ఛేంజ్‌డ్‌ అనే నోటిఫికేషన్‌ వద్దనుకుంటే మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లో షో సెక్యూరిటీ కోడ్ అనే ఆప్షన్ డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని