Whatsapp డెడ్‌లైన్‌.. యూజర్లకు ఊరట

వాట్సాప్‌ వినియోగదారులకు ఊరట. గడువు ముగిసినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన వారి ఖాతాలు డిలీట్‌ చేయబోమని వాట్సాప్‌ స్పష్టంచేసింది. ఇందుకోసం.

Published : 07 May 2021 19:48 IST

దిల్లీ: వాట్సాప్‌ వినియోగదారులకు ఊరట. గడువు ముగిసినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన వారి ఖాతాలు డిలీట్‌ చేయబోమని వాట్సాప్‌ స్పష్టంచేసింది. ఇందుకోసం విధించిన మే 15 డెడ్‌లైన్ విషయంలో వెనక్కి తగ్గింది. ఆ గడువు దాటినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన ఖాతాలు కొనసాగుతాయని వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అలాగే, ప్రైవసీ పాలసీని ఆమోదించాలన్న రిమైండర్లను మరికొన్ని వారాల పాటు యూజర్లకు పంపిస్తామని వాట్సాప్‌ ప్రతినిధి చెప్పారు. ఇప్పటి వరకూ అలా సందేశాలు వచ్చిన వారిలో చాలా మంది ప్రైవసీ పాలసీని ఆమోదించారని తెలిపారు. అయితే, ఎంత మంది నూతన పాలసీని ఆమోదించారనే అంశంపై స్పష్టతనివ్వలేదు. అలాగే, వాట్సాప్‌ తాజా నిర్ణయం వెనుక అసలు కారణం మాత్రం తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని