వాట్సప్‌లో ఆడియో ఛాట్స్‌

వాట్సప్‌ కొత్తగా ఆడియో ఛాట్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. మున్ముందు అప్‌డేట్‌తో ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులోకి రానుంది.

Published : 29 Mar 2023 00:06 IST

వాట్సప్‌ కొత్తగా ఆడియో ఛాట్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. మున్ముందు అప్‌డేట్‌తో ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లకు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ఆడియో ఛాట్స్‌ను కొనసాగించొచ్చు. అవతలివారు మాట్లాడటం ఆపినట్టు తెలియటానికి ఎర్ర బటన్‌ కూడా కనిపిస్తుంది. తరంగాల మాదిరి గుర్తుతో ఇది ఛాట్‌ హెడర్‌లో కనిపించనుంది.

వాట్సప్‌లో గ్రూపులకు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. నిత్య జీవితంలో ఇవి ముఖ్యమైన భాగంగానూ మారిపోయాయి. దీంతో అడ్మిన్ల పర్యవేక్షణ కీలకంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అడ్మిన్ల కోసం ప్రత్యేకంగా కొత్త ఫీచర్‌ను జోడించింది. దీని ద్వారా ఎవరినైనా గ్రూపులో చేర్చుకోవాలా? వద్దా? అనేది అడ్మిన్లు నిర్ణయించుకోవటానికి వీలవుతుంది.

మొబైల్‌ వర్షన్‌లో మాదిరిగా త్వరగా లోడ్‌ కావటానికి విండోస్‌ కోసం కొత్త ఇంటర్ఫేస్‌నూ పరిచయం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని