
WhatsApp Status: వాట్సాప్ వెబ్‌లో స్టేటస్ ఆపేయండిలా.. మరో కొత్త ఫీచర్ ఏంటంటే?
ఇంటర్నెట్‌డెస్క్: యూజర్స్‌కు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమ సంస్థలు (Social Media) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తుంటాయి. ఈ జాబితాలో వాట్సాప్ (WhatsApp)ముందంజలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. గత ఆరు నెలలుగా వరుసగా కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ యూజర్స్‌ను ఆకట్టుకుంటోంది ఈ మెసేజింగ్ యాప్. తాజా మరో రెండు కొత్త ఆప్షన్లను యూజర్స్‌కు పరిచయం చేయనుంది. మనకు సంబంధించిన ఫొటోలు, వీడియో, సమాచారం, వెబ్ లింక్స్, సంతోషం, బాధ కలిగించే విషయాలు ఒకేసారి అందరితో పంచుకోవడం సాధ్యపడదు. అదే వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status)లో షేర్ చేస్తే మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరు చూడగలరు. అందుకే వాట్సాప్‌లో స్టేటస్ ఫీచర్‌కు ఆదరణ ఎక్కువ. తాజాగా స్టేటస్ ఫీచర్లలో మరో రెండు కొత్త ఆప్షన్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. మరి అవేంటో ఒక్కసారి చూద్దాం.
వాట్సాప్ స్టేటస్ పాజ్ (WhatsApp Status Play & Pause)
వాట్సాప్‌లో మనం స్టేటస్ చూస్తున్నప్పడు అవి ఎంతో వేగంగా మారుతుంటాయి. ఫొటో/వీడియోలైతే చూడొచ్చు. ఒకవేళ స్టేటస్‌లో ఏదైనా టెక్ట్స్ ఉంటే వేగంగా చదవడం అందరికీ సాధ్యంకాదు. అందుకే స్టేటస్‌లో ప్లే అండ్ పాజ్ (Play & Pause) ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్స్ తాము చూస్తున్న ఫొటో/వీడియో/టెక్ట్స్‌ను పాజ్ చేసి చూసి తిరిగి ప్లే చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది వెబ్ వెర్షన్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వెబ్ యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. అయితే వాట్సాప్ ఈ ఫీచర్‌ను మొబైల్ వెర్షన్లో కూడా తీసుకొస్తుందా? లేదా అనేది దానిపై స్పష్టతలేదు.
వాట్సాప్ స్టేటస్ అన్డూ (WhatsApp Status Undo)
స్టేటస్‌లో అందుబాటులోకి రానున్న మరో కొత్త ఆప్షన్ అన్డూ (Undo). అంటే స్టేటస్ పోస్ట్ చేసిన తర్వాత అందులో తప్పు దొర్లినట్లు మీకు అనిపిస్తే వెంటనే మీరు అన్‌డూపై క్లిక్ చేస్తే స్టేటస్ డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం స్టేటస్ డిలీట్ చేయాలంటే వాట్సాప్‌లో స్టేటస్ సెక్షన్లోకి వెళ్లి కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో డిలీట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే స్టేటస్ డిలీట్ అయిపోతుంది. ఇందుకు కాస్త సమయం పడుతుంది. త్వరలో తీసుకురానున్న అన్డూ ఫీచర్‌తో కేవలం ఒక్క క్లిక్‌తో స్టేటస్ డిలీట్ అయిపోతుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.