WhatsApp: రేపటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్‌!

భద్రత, గోప్యత, ఫీచర్ల పరంగా యూజర్లకు అత్యాధునిక సాంకేతికతను అందించడంలో భాగంగా వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాత వెర్షన్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న పలు ఫోన్లలో వాట్సాప్ సర్వీస్‌ నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Published : 23 Oct 2022 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా  టెక్‌ కంపెనీలు, సోషల్‌ మీడియా సంస్థలు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా అమలుచేయాల్సిందే. ఇందులో భాగంగా కొన్ని పాతతరం డివైజ్‌లకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు చెబుతుంటాయి. తాజాగా వాట్సాప్‌ కూడా ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొన్ని మోడల్స్‌కు అక్టోబరు 24 నుంచి తమ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెక్యూరిటీ ఫీచర్ల అప్‌గ్రేడ్‌, యూజర్‌ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇంతకీ, రేపటి నుంచి ఏయే ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయో చూద్దాం. 

ఐఓఎస్‌ 10, ఐఓఎస్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తున్న ఐఫోన్లలో ఇకపై వాట్సాప్‌ పనిచేయదు. ప్రస్తుతం ఐఫోన్‌ 4, ఐఫోన్ 4ఎస్‌,  ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ ఫోన్లు ఈ ఓఎస్‌లతో పనిచేస్తున్నాయి. యాపిల్ నిబంధనల ప్రకారం ఐఫోన్‌ 4, ఐఫోన్‌ 4ఎస్‌ మోడల్స్‌లో ఓఎస్‌ అప్‌డేట్‌ కాదు. కేవలం ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ మోడల్స్‌ మాత్రమే ఓఎస్‌ అప్‌డేట్‌కు అవకాశం ఉంది. దీంతో  ఈ ఫోన్ యూజర్లు వెంటనే తమ డివైజ్‌లలో ఐఓఎస్‌ 12ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్‌ సూచించింది. ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్‌ సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేయొచ్చు. మరోవైపు ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం వాట్సాప్ కీలక సూచన చేసింది.  ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్‌ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో కూడా వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది. ఈ ఓఎస్‌ తర్వాతి వెర్షన్‌కు యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని