WhatsApp: వాట్సాప్‌ చాట్‌బాట్‌.. కొత్తగా ఏమొచ్చినా చెప్పేస్తుంది!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్‌ అనగానే యూజర్స్‌ ఆసక్తి కనబరుస్తారు. ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా వాట్సాప్‌ కూడా ఎప్పటికప్పుడు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను తీసుకొస్తుంది. యూజర్స్‌ కోసం మరో కొత్త ఫీచర్‌ రాబోతుంది... 

Updated : 12 Aug 2022 14:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్‌ అనగానే యూజర్స్‌ ఆసక్తి కనబరుస్తారు. ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా వాట్సాప్‌ కూడా ఎప్పటికప్పుడు యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యూజర్స్‌ కోసం మరో కొత్త ఫీచర్‌ రాబోతుంది. వాట్సాప్‌ న్యూ అప్‌డేట్స్‌ పేరుతో చాట్‌బాట్‌ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో యూజర్లు వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్స్‌, ఫీచర్లు, ట్రిక్స్‌ గురించిన సమాచారం తెలుస్తుంది. ఇప్పటిదాకా వాట్సాప్‌ ట్రిక్స్‌, కొత్త ఫీచర్‌ లేదా అప్‌డేట్ సమాచారం టెక్‌ పేజీలు, వాట్సాప్ ట్విటర్ లేదా బ్లాగ్‌ నుంచి తెలిసేది. ఇకపై వాట్సాప్‌ తన అధికారిక ఖాతా నుంచి చాట్‌బాట్‌ ద్వారా అప్‌డేట్స్‌, ఫీచర్లు, ట్రిక్స్‌, ప్రైవసీ అండ్‌ సేఫ్టీకి సంబంధించిన సమాచారం నేరుగా యూజర్‌కు తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు, తర్వాత ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.

యూజర్స్‌ వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలు వద్దనుకుంటే సదరు వాట్సాప్‌ ఖాతాను బ్లాక్‌ చేయొచ్చు. యూజర్లకు మెరుగైన సేవలందించడంలో భాగంగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. టెలిగ్రామ్‌, సిగ్నల్ వంటి మెసేజింగ్‌ యాప్‌లు ఇప్పటికే ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. ఇవేకాకుండా మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్‌ పరీక్షిస్తోంది. వీటిలో ప్రివ్యూ మెసేజ్‌ రియాక్షన్స్‌, పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌, వాయిస్‌ మెసేజ్‌ స్టేటస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రివ్యూ మెసేజ్‌ రియాక్షన్స్‌తో ఎవరెవరు ఎమోజీలతో రిప్లై ఇచ్చారనేది తెలుసుకోవచ్చు. పాస్ట్ పార్టిసిపెంట్స్‌ ఫీచర్‌తో గ్రూపు నుంచి వెళ్లిపోయిన వారి గురించి తెలుసుకోవచ్చు. ఇక వాయిస్‌ మెసేజ్‌ స్టేటస్‌తో ఆడియో మెసేజ్‌లను కూడా వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు