WhatsApp: వాట్సాప్‌లో మెసేజ్‌ డిలీట్ చేశారా..? ఒక్క క్లిక్‌తో రికవరీ!

వాట్సాప్‌ యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు... 

Published : 18 Aug 2022 19:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్లు డిలీట్‌ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.  ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున లేదా తొందరపాటువల్ల ఏదైనా మెసేజ్‌ లేదా మీడియాఫైల్‌ను డిలీట్ చేస్తే వాటిని తిరిగి రికవరీ చేసుకునే అవకాశంలేదు. త్వరలో తీసుకురాబోతున్న ఫీచర్‌తో డిలీట్ చేసిన మెసేజ్‌లను కూడా తిరిగి పొందవచ్చు. 

యూజర్లు మెసేజ్‌ డిలీట్ చేసిన వెంటనే చాట్ స్క్రీన్‌ మీద మెసేజ్‌ డిలీటెడ్ (Message Deleted) లైన్‌తోపాటు అన్‌డూ (UNDO) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అన్‌డూపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్‌ తిరిగి చాట్ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. మెసేజ్‌ డిలీట్ చేసేప్పుడు యూజర్ డిలీట్ ఫర్‌ మీ (Delete For Me) అనే ఆప్షన్‌ సెలెక్ట్ చేస్తే అన్‌డూ ఆప్షన్‌ కనిపించదు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone) ఆప్షన్‌ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లకు మాత్రమే అన్‌డూ ఆప్షన్‌ చూపిస్తుంది. 

ఈ ఫీచర్‌తోపాటు హైడ్‌ ఫోన్‌ నంబర్‌ అనే ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్లు తమ ఫోన్‌ నంబర్‌ ఇతరులకు కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ఆప్షన్‌ను కమ్యూనిటీస్‌ ఫీచర్‌లో పరిచయం చేయనుంది. కమ్యూనిటీస్‌లో కొత్త వ్యక్తిని యాడ్‌ చేసినప్పుడు సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను కమ్యూనిటీ అడ్మిన్‌ మినహా ఇతర సభ్యులు చూడలేరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని