Whatsapp Update: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్‌.. చాట్‌ లిస్ట్‌లోనే స్టేటస్‌ అప్‌డేట్‌!

వాట్సాప్‌ స్టేటస్‌ గురించి మనందరికీ తెలిసిందే. స్టేటస్‌ ట్యాబ్‌లోకి వెళితే ఎవరెవరు ఏ స్టేటస్‌ పెట్టారో తెలుసుకోవచ్చు. అయితే, ఆ ట్యాబ్‌లోకి వెళితే గానీ ఎవరెవరు ఏం పెట్టారో తెలిసే అవకాశం లేదు.

Published : 02 May 2022 19:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ స్టేటస్‌ గురించి మనందరికీ తెలిసిందే. స్టేటస్‌ ట్యాబ్‌లోకి వెళితే ఎవరెవరు ఏ స్టేటస్‌ పెట్టారో తెలుసుకోవచ్చు. అయితే, ఆ ట్యాబ్‌లోకి వెళితే గానీ ఎవరెవరు ఏం పెట్టారో తెలిసే అవకాశం లేదు. అయితే, వాట్సాప్‌లో కొత్త సదుపాయం రాబోతోంది. ఇకపై మీరు చాట్‌ చేసిన వ్యక్తి స్టేటస్‌ పెడితే ఇట్టే తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ త్వరలో రాబోతోందని WABetaInfo పేర్కొంది. దీనిపై ప్రస్తుతం వాట్సాప్‌ పనిచేస్తోందని, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతోందని తెలిపింది.

మన వాట్సాప్‌లో చాట్‌ లిస్ట్‌లో కనిపించే ప్రొఫైల్‌ డీపీపై క్లిక్‌ చేస్తే ఇప్పటి వరకు వారి ప్రొఫైల్‌ పిక్‌ పూర్తిగా కనిపించేది. ఇకపై ఒకవేళ వారు స్టేటస్‌ ఏదైనా పెడితే స్టేటస్‌ పేజీకి వెళుతుంది. ఈ కొత్త ఫీచర్‌ వల్ల మనకు నచ్చిన వారు ఏదైనా స్టేటస్‌ పెడితే వెంటనే తెలుసుకునే వీలుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది. మరోవైపు వాట్సాప్‌ గ్రూప్‌ పోల్‌ ఫీచర్‌ను సైతం తీసుకొచ్చేందుకు పరీక్షలు జరుపుతోంది. వాట్సాప్‌ గ్రూప్‌లో ఎవరైనా ఒక అంశంపై పోల్‌ నిర్వహించవచ్చు. ఆ పోల్‌లో ఎంత మంది పాల్గొన్నారు? ఏ ఆప్షన్‌ను ఎక్కువగా ఎంచుకున్నారు? వంటి వివరాలు తెలుస్తాయి. అయితే, ఏ వ్యక్తి ఏ అభిప్రాయం వ్యక్తంచేశారనేది మాత్రం తెలుసుకునే వీలుండదు. ఈ సదుపాయం ఎప్పుడు తీసుకొచ్చేది తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని