WhatsApp: త్వరలో 24 గంటల్లో మాయం

24 గంటల్లో whatsapp మెసేజ్‌లు మాయమైపోయేలా డిస్‌అపియరింగ్‌ ఫీచర్‌

Published : 26 Apr 2021 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ వాట్సాప్‌లోని గ్రూపులు, వ్యక్తిగత ఖాతాల్లో మెసేజ్‌లు వారం రోజులకు ఒకసారి మాయం అయిపోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసుగా.. సింపుల్‌ ఆ ఖాతా ఇన్ఫో పేజీలో డిస్‌అపియరింగ్ మెసేజెస్‌ ఫీచర్‌ను యాక్టివ్‌ చేసుకోవడమే. అయితే ఈ ఫీచర్‌లో వారంపాటు ఆ మెసేజ్‌లు/ఫొటోలు ఉండటం ఎందుకు అని మీకెప్పుడైనా అనిపించిందా? ఒక రోజే ఉంటే బాగుండు అని అనుకున్నారా?. అయితే మీ మాట నిజం కాబోతోంది.. అవును 24 గంటల్లో  మొత్తం అన్ని రకాల పోస్టులు డిలీట్‌ అయ్యే ఆప్షన్‌ రాబోతోందట.

కొత్త ఆప్షన్‌ను ఇలా తీసుకొస్తూనే, బ్యాగ్రౌండ్‌లో దానికి అదనపు మెరుగులు దిద్దడం వాట్సాప్‌కు అలవాటు. అలా డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌కు ఇప్పుడు టైమ్‌ సెలక్షన్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారట. అంటే డిస్‌అపియరింగ్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసిన వెంటనే ఎన్ని రోజులకు డిలీట్‌ అవ్వాలి అని అడుగుతుందట. అందులో 24 గంటలు, ఏడు రోజులు అని రెండు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు కావాల్సింది ఎంచుకుంటే సరి. అక్కడ 24 గంటలు ఎంచుకుంటే, ఒక రోజులో మెసేజ్‌లు మాయమవుతాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగ దశలో ఉంది. కొంతమందికి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో అందరికీ యాక్సెస్‌లోకి వస్తుంది.

డిస్‌అపియరింగ్‌ ఆన్‌ చేయడం ఇలా..

డిస్‌అపియరింగ్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేయడానికి...  ఏదైనా గ్రూపు, పర్సనల్‌ ఛాట్‌లోకి వెళ్లండి. పైన గ్రూపు/వ్యక్తి పేరు మీద క్లిక్‌ చేస్తే ప్రొఫైల్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌ అని కనిపిస్తుంది. పక్కన చిన్న టైమర్‌ ఐకాన్‌ కూడా ఉంటుంది. దానిని క్లిక్‌ చేస్తే ఆన్‌/ఆఫ్‌ అని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఫీచర్‌ ఆన్‌ చేయాలంటే అక్కడ ఆన్‌ క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఆ గ్రూప్‌/ వ్యక్తి ఖాతాలో మెసేజ్‌ వచ్చిన ఏడు రోజులకు డిలీట్‌ అయిపోతుంది. త్వరలో ఇదే పేజీలో 24 గంటలు, ఏడు రోజుల అని ఆప్షన్‌ రాబోతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని