WhatsApp: బ్యాకప్‌ డేటాకు అదనపు భద్రత!

వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని సాయంతో క్లౌడ్‌లో స్టోర్ అయ్యే ఛాట్ బ్యాక్‌అప్‌లను స్వతంత్రంగా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. దానివల్ల యూజర్ డేటా మరింత భద్రంగా ఉంటుందని వాట్సాప్ తెలిపింది...

Updated : 19 Jul 2021 17:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని సాయంతో క్లౌడ్‌లో స్టోర్ అయ్యే ఛాట్ బ్యాక్‌అప్‌లు స్వతంత్రంగా ఎన్‌క్రిప్ట్ అవుతాయి. దానివల్ల యూజర్ డేటా మరింత భద్రంగా ఉంటుందని వాట్సాప్ తెలిపింది. అంతేకాకుండా ఈ డేటాకు 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్ కీతో రక్షణ కల్పిస్తున్నారు. ఒకవేళ యూజర్‌ 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్‌ పాస్‌కోడ్ మర్చిపోయినా డేటాను రికవరీ చేయడం కుదరదు. అలానే వాట్సాప్‌ కూడా ఈ డేటాను యాక్సెస్‌ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్ విడుదల చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

ఇప్పటి వరకు వాట్సాప్‌లో జరిగే ఛాట్ సంభాషణలకు ఎండ్-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికతతో రక్షణ కల్పిస్తున్నారు. దాని వల్ల సదరు మెసేజ్‌లను ఛాట్ చేస్తున్న ఇద్దరు మినహా ఇతరులు యాక్సెస్‌ చేయలేరు. అయితే ఈ డేటా క్లౌడ్‌లో బ్యాకప్‌ అయిన తర్వాత దానికి ఎన్‌క్రిప్షన్ ప్రొటెక్షన్‌ లేదు. త్వరలోనే తీసుకురానున్న అప్‌డేట్‌లో క్లౌడ్‌లో స్టోర్‌ అయిన డేటాకు కూడా 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్‌ కీతో రక్షణ కల్పించనుంది. అలానే త్వరలో పరిచయం చేయనున్న మల్టీడివైజ్‌ ఫీచర్‌లో కూడా ప్రతి డివైజ్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని