WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక ఆ అధికారం గ్రూప్ అడ్మిన్‌లదే!
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల కోసం కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీని సాయంతో గ్రూప్ ఆసక్తికి విరుద్ధంగా ఉండే మెసేజ్‌లను గ్రూప్ నుంచి సులువుగా తొలగించవచ్చు.
ఇంటర్నెట్‌డెస్క్: మనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునేందుకు, ఒకే అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు నచ్చిన విషయాల గురించి చర్చించుకునేందుకు వీలుగా వాట్సాప్(Whatsapp)లో గ్రూప్‌లు క్రియేట్ చేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసే కొన్ని పోస్టులు గ్రూప్ అడ్మిన్‌లను చిక్కుల్లో పడేస్తుంటాయి. ఒకవేళ గ్రూప్‌లోంచి సదరు మెసేజ్ డిలీట్ చేయాలంటే సాధ్యంకాని పరిస్థితి. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను డిలీట్ చేయాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకే గ్రూప్ అడ్మిన్‌ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో గ్రూప్‌లో షేర్ చేసే పోస్టులను అడ్మిన్‌లు డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్(Whatsapp) కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.
వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసిన టెక్ట్స్, ఫొటో, వీడియో, డాక్యుమెంట్ ఫైల్‌లను డిలీట్ చేయాలా.. వద్దా అనేది ఇక మీదట గ్రూప్ అడ్మిన్‌లు నిర్ణయిస్తారు. ఒకవేళ అభ్యంతరకరమైన మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేస్తే.. గ్రూప్ చాట్ పేజీలో ‘గ్రూప్ అడ్మిన్ దాన్ని తొలగించారు’ అనే మెసేజ్ కనిపిస్తుంది. గ్రూప్‌కు ఒకరికి మించి ఎక్కువమంది అడ్మిన్‌లుగా ఉన్నా.. ఈ ఫీచర్‌తో వారందరూ మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చని వాబీటాఇన్ఫో వెల్లడించింది. అలా అడ్మిన్‌లు గ్రూప్ ఆసక్తికి విరుద్ధంగా ఉన్న మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. దీంతోపాటు వాట్సాప్ ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్స్ తాము పంపిన మెసేజ్‌ను నిర్ణీత కాలవ్యవధిలో డిలీట్ అయ్యేలా టైమ్ లిమిట్ పెట్టొచ్చు. గతంలో వాట్సాప్ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ 7 నిమిషాలుగా ఉండేది. త్వరలోనే మూడు కొత్త టైమ్ లిమిట్‌లను తీసుకొస్తుంది. అవి గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు. దీనివల్ల యూజర్ పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులు ఉంటే పైన పేర్కొన్న కాలపరిమితిలోపు వాటిని డిలీట్ చేస్తే అవతలివారు చూడలేరు. ఇవేకాకుండా వాట్సాప్ ప్లేయర్, ఆడియో మెసేజ్ ప్రివ్యూ, కమ్యూనిటీ వంటి మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్(Whatsapp) యూజర్స్‌కు పరిచయం చేయనుంది.
► Read latest Tech & Gadgets News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
2000 Notes: గల్ఫ్‌లోని భారతీయులకు రూ.2000 నోట్ల కష్టాలు
-
General News
CM Kcr: కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. రెండ్రోజుల్లో విధివిధానాలు: సీఎం కేసీఆర్
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. మరో నలుగురు అరెస్టు
-
General News
AP Employees: 160 డిమాండ్లతో ఏపీ సీఎస్‌కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతిపత్రం
-
Sports News
GT vs CSK: చెలరేగిన సుదర్శన్.. చెన్నై విజయలక్ష్యం 215
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు