WhatsApp: డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్

వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీని సాయంతో యూజర్స్ తమ ఖాతాలకు సంబంధించిన రిపోర్ట్‌ను పొందవచ్చు.

Updated : 03 Feb 2022 18:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న రిక్వెస్ట్‌ అకౌంట్‌ ఇన్ఫో (Request Account Info) ఫీచర్‌ను డెస్క్‌టాప్‌, వెబ్‌ వెర్షన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ‌దీంతో యూజర్స్ తమ వాట్సాప్‌ ఖాతాల సమాచారంతోపాటు సెట్టింగ్స్‌కు సంబంధించిన నివేదికను పొందవచ్చు. ఇందులో యూజర్స్‌ వాట్సాప్‌ ఖాతా ఎక్కడి నుంచి ఏయే డివైజ్‌లలో లాగిన్‌ అయిందనే సమాచారంతోపాటు, ప్రైవసీ సెట్టింగ్స్‌కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, ముందుగా బీటా యూజర్లకు, తర్వాత సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటా ఇన్ఫో) తెలిపింది. 

యూజర్ రిపోర్ట్ రిక్వెస్ట్ చేసిన మూడు రోజుల్లో వాట్సాప్ నుంచి ఈ నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌ మొబైల్‌ యాప్‌లో ఈ ఫీచర్‌ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రిక్వెస్ట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఖాతాకు సంబంధించిన రిపోర్ట్ వస్తుంది. యూజర్స్‌ ఖాతాలకు సంబంధించి వాట్సాప్‌ ఎలాంటి సమాచారం సేకరిస్తుందనేది యూజర్లు తెలుసుకోవాలనే  ఉద్దేశంతో 2018లో వాట్సాప్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవేకాకుండా వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో వాట్సాప్‌ వినియోగం మరింత సురక్షితంగా ఉంటుందని, ఇతరులెవరూ యూజర్ ఖాతాలను హ్యాక్‌ చేయలేరని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని