
WhatsApp New Features: వాట్సాప్ పేమెంట్‌కి వెరిఫికేషన్.. బ్యాకప్‌కి ఎన్క్రిప్షన్ భద్రత
ఇంటర్నెట్‌డెస్క్: వాట్సాప్ పేమెంట్‌లో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. దీంతో వాట్సాప్ పేమెంట్ ద్వారా చెల్లింపులు చేసే ప్రతిసారీ యూజర్ సదరు చెల్లింపును వైరిఫై చేసి ధ్రువీకరించాలి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీనిద్వారా చెల్లింపుల్లో మోసాలు చోటుచేసుకోకుండా నివారించవచ్చని వాట్సాప్ చెబుతోంది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలనుకునే వారి బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్‌ను మాత్రమే వెరిఫై చేస్తున్నారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో మాత్రం యూజర్ క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను వెరిఫై చేయాలి. త్వరలో ఈ నిబంధనలో కూడా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట వాట్సాప్ పేమెంట్ సేవలను ఆయా దేశాల చట్టాలకు అనుగుణంగా రూపొందించనున్నట్లు సమాచారం. అలానే వాట్సాప్ పేమెంట్ సేవల కోసం యూజర్ గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేసేలా కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వాట్సాప్‌లో ఛాట్ బ్యాకప్‌కి ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ని వాట్సాప్ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిసాయంతో యూజర్స్ తమ ఛాట్ సమాచారాన్ని బ్యాకప్ చేసుకున్న తర్వాత దానికి ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుంది. ఇటీవలి కాలంలో యూజర్ డేటా లక్ష్యంగా సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్స్కే అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తిస్థాయి యూజర్స్‌కి పరిచయం చేయనున్నారు. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఛాట్స్ ఓపెన్ చేయాలి. అందులో బ్యాకప్ ఛాట్స్పై క్లిక్ చేస్తే ‘బ్యాకప్ విత్ ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా యూజర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.