WhatsApp: వాట్సాప్‌ అప్‌డేట్‌.. చాట్‌ విండోలో కీలక ఫీచర్ల ప్లేసులు మారుతున్నాయ్‌!

వాట్సాప్‌ వినియోగాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు త్వరలో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా కొన్ని ఫీచర్ల స్థానాల్లో మార్పులు చేయనుంది.

Published : 07 Jan 2022 16:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే కొన్ని ఫీచర్స్‌ను వాటి పాత స్థానం నుంచి కొత్త చోటుకి మార్చనుంది. ఇందులో భాగంగా ‘చాట్ లిస్ట్‌’ నుంచి బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్‌, న్యూ గ్రూప్‌ ఆప్షన్లను తొలగించనుంది. వాట్సాప్‌లో ఒకేసారి ఎక్కువ మంది మెసేజ్‌ పంపేందుకు బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్‌ ఉపయోగిస్తాం. అలానే ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులు, బంధువులు, స్నేహితులు ఆన్‌లైన్‌లో తమ ఆలోచనలు, అభిప్రాయాలు ఇతరులతో పంచుకునేందుకు, సరదాగా సంభాషించేందుకు వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్ చేస్తారు. ఈ రెండు ఆప్షన్లను వాట్సాప్‌ త్వరలో పరిచయం చేయనున్న కొత్త అప్‌డేట్‌లో తొలగించనుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ఈ మేరకు యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో మార్పులు చేయనుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, త్వరలో కొత్త అప్‌డేట్‌ యూజర్స్‌కు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ అప్‌డేట్ తర్వాత బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌, న్యూ గ్రూప్‌ ఆప్షన్లు వాట్సాప్‌ విండోలోని ‘న్యూ చాట్‌’ ఆప్షన్‌లో కనిపిస్తాయి. అంటే న్యూ చాట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అందులో సెర్చ్‌బార్‌ పైన బ్రాడ్‌కాస్ట్‌ లిస్ట్‌, సెర్చ్‌బార్‌ కింద న్యూ గ్రూప్ ఆప్షన్‌ ఫీచర్లు ఉంటాయి. వాట్సాప్‌ కొత్త ఫీచర్స్‌లో భాగంగా ప్రొఫైల్‌ ఫొటో నోటిఫికేషన్ ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉంది. ఇదే కాకుండా వాట్సాప్‌ వినియోగాన్ని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు కొత్త ఫీచర్లను త్వరలో యూజర్స్‌కు పరిచయం చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని