Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్.. ‘చూడూ.. ఒకసారే చూడూ!’
WhatsApp view once messages feature: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. మెసేజ్‌ను సైతం ఇకపై ఒకసారే చూసేందుకు వీలయ్యేలా కొత్త సదుపాయం తీసుకొస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మనందరి నిత్య జీవితంలో భాగమైపోయిన వాట్సాప్ (Whatsapp).. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. వ్యక్తుల చాట్‌ను కొంత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేందుకు వీలుగా ఇప్పటికే ‘డిస్ అపియరింగ్’ పేరిట ఓ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహాలో మరో ఫీచర్‌ను సైతం తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.
వాట్సాప్ తీసుకురాబోతున్న వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ (view once messages feature) ద్వారా ఎవరైనా పంపించిన సందేశాన్ని కేవలం ఒక్కసారి చూసేందుకు మాత్రమే వీలుంటుంది. ఒకసారి చూశాక అది కనిపించదు. అటు పంపించేవారికి, అందుకునే వారికి సైతం ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అంటే ఎవరైనా పంపిన మెసేజ్‌ను వేరొకరికి పంపించడానికి వీలుండందన్నమాట.
ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి వ్యూ వన్స్ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. ఏదైనా ఫొటో/ వీడియోను ఒకసారి చూశాక మరోసారి చూడ్డానికి వీలుండదు. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవడం సైతం కుదరదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను టెక్ట్స్ ఫార్మాట్‌కు సైతం అప్లయ్ చేయాలని వాట్సాప్ చూస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెండ్ బటన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో ఎప్పుడు తీసుకొస్తారనేది మాత్రం తెలియరాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..
-
Crime News
హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రకు సూత్రధారి ఫర్హతుల్లానే!
-
General News
Bhadrachalam: రాములోరి పెళ్లికి ఖమ్మం గోటి తలంబ్రాలు
-
Sports News
Steve Smith: ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
India News
Ballari: బళ్లారి నగర పాలికె మేయర్‌గా 23 ఏళ్ల యువతి