WhatsApp: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్‌.. త్వరలో మెసేజ్‌ ‘ఎడిట్‌’..!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తోన్న వాట్సప్‌ మెసేజింగ్‌ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో మెసేజ్‌ ‘ఎడిట్‌’ బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు

Published : 01 Jun 2022 13:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తోన్న వాట్సప్‌ మెసేజింగ్‌ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో మెసేజ్‌ ‘ఎడిట్‌’ బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం వాట్సప్‌లో పంపిన మెసేజ్‌లో ఏవైనా పొరబాట్లు ఉంటే దాన్ని డిలీట్‌ చేయడం తప్పితే మరో అవకాశం లేదు. అలా కాకుండా మెసేజ్‌ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని ఈ ఎడిట్‌ ఆప్షన్‌ కల్పించనుంది. ప్రస్తుతం దీనిపై వాట్సప్‌ టెస్టింగ్‌ చేస్తున్నట్లు ‘వాబీటాఇన్ఫో’ అనే వెబ్‌సైట్‌ వెల్లడించింది. వాట్సప్‌కు సంబంధించిన అప్‌డేట్లను ఈ వెబ్‌సైట్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తుంది.

ఎడిట్‌.. ఎలా పనిచేయనుందంటే..

వాబీటాఇన్ఫో సమాచారం ప్రకారం.. వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపిన తర్వాత దాన్ని సెలక్ట్‌ చేస్తే copy, forward వంటి ఆప్షన్లు కన్పిస్తాయి కదా. ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కాపీ, ఫార్వర్డ్‌తో పాటు edit ఆప్షన్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి పంపిన మెసేజ్‌లో తప్పులు, స్పెల్లింగ్‌లు వంటివి సరిచేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఆప్షన్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. అయితే మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకునేందుకు టైం లిమిట్‌ ఏమైనా ఉంటుందా? అన్నదానిపై ఇప్పుడైతే స్పష్టత లేదని వాబీటాఇన్ఫో వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో దీన్ని టెస్ట్‌ చేస్తున్నారు. అయితే, ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్లలోనూ ఒకేసారి ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు