WhatsApp: ఒకేసారి 32 మందికి వీడియోకాల్.. డీఎన్డీ మోడ్, డాక్యుమెంట్ క్యాప్షన్.. ఇంకా!
వాట్సాప్ త్వరలో యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. వీటిలో కెమెరా మోడ్, డీఎన్డీ మోడ్, లింక్స్ కాల్ ఇన్విటేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరి, ఈ ఫీచర్లతో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయో చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: పర్సనల్ లేదా ప్రొఫెషన్.. కమ్యూనికేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాట్సాప్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్, అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో ఉచితంగా అందుబాటులో ఉండటం ఎక్కువ మందిని ఆకర్షించడానికి ప్రధాన కారణం. వాట్సాప్ ఇటీవలే మరికొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే డిలీట్ ఫర్ మీ టైమ్ లిమిట్, అన్‌రీడ్ చాట్ ఫిల్టర్, సైలెంట్ గ్రూప్ ఎగ్జిట్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. మరి కొత్తగా రాబోయే ఫీచర్లతో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం.
లింక్స్‌తో కాల్ ఇన్విటేషన్
వాట్సాప్‌లో వీడియో/ఆడియోకాల్స్ కోసం లింక్ ఇన్విటేషన్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇందుకోసం గ్రూప్ కాల్ నిర్వహించాలనుకునే వ్యక్తి కాల్ సెక్షన్‌లోని వెళ్లి లింక్‌ను క్రియేట్ చేయాలి. తర్వాత సదరు లింక్‌ను ఎవరైతే కాల్లో పాల్గొనాలనుకుంటున్నారో వారితో షేర్ చేస్తే, అవతలివారు లింక్‌పై క్లిక్ చేసి, కాల్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లకు అంబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తెలిపింది.
కెమెరా మోడ్
ఈ ఫీచర్‌తో యూజర్లు ఫొటో/వీడియో మోడ్‌లోకి సులువుగా మారొచ్చు. ప్రస్తుతం వాట్సాప్ యాప్ ద్వారా ఫొటో తీయాలంటే చాట్ పేజీలో కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాలి. వీడియో రికార్డింగ్ కోసం కెమెరా ఓపెన్ అయిన తర్వాత క్యాప్చర్ బటన్‌ను కొన్ని సెకన్లపాటు హోల్డ్ చేస్తే రికార్డింగ్ ప్రారంభమవుతుంది. వీటికి బదులు ఫోన్ కెమెరాలో ఉన్నట్లుగా ఫొటో, వీడియో సెలక్షన్ కోసం వేర్వేను మోడ్స్‌ను పరిచయం చేయనున్నారు.
ఇకపై ఎనిమిది కాదు 32
వాట్సాప్ వీడియోకాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ సంఖ్య ఎనిమిదిగా ఉంది. వాట్సాప్ వీడియోకాల్ ఫీచర్ పరిచయమైన తొలినాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. తర్వాత ఆ సంఖ్యను నాలుగుకు పెంచారు. ప్రస్తుతం ఎనిమిదిగా ఉన్న ఈ లిమిట్‌ను 32కు పెంచనున్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో యూజర్లకు పరిచయం చేస్తారని తెలుస్తోంది.
డీఎన్డీ మోడ్
ఆఫీస్ మీటింగ్‌లో ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా నిద్రాభంగం లేకుండా ఉండేందుకు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టేస్తుంటాం. ఇదే తరహా ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. డూ నాట్ డిస్ట్రబ్ (DND) మోడ్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్‌కు వాట్సాప్ కాల్స్, నోటిఫికేషన్లు వచ్చిన కూడా స్క్రీన్‌పై కనిపించవు. యూజర్ డీఎన్డీ మోడ్ డిసేబుల్ చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేస్తే అందులో మిస్డ్కాల్స్, మెసేజ్ వివరాలు కనిపిస్తాయి.
వాయిస్ స్టేటస్
వాట్సాప్‌లో ఇప్పటిదాకా ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ను మాత్రమే స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం ఉంది. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో యూజర్లు ఆడియో క్లిప్స్తోపాటు, ఇతరులు పంపిన లేదా రికార్డు చేసిన వాయిస్ నోట్స్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఆడియో స్టేటస్ కోసం యూజర్లు స్టేటస్ బార్ ఓపెన్ చేస్తే కెమెరా, టెక్ట్స్ ఫీచర్లతోపాటు కొత్తగా మైక్ సింబల్ కనిపిస్తుంది. మైక్ సింబల్‌పై క్లిక్ చేసి ఆడియో రికార్డ్ చేసిన తర్వాత నచ్చిన కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో దాన్ని స్టేటస్‌లో అప్డేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.
కొత్త స్టిక్కర్స్
ప్రొఫైల్ ఫొటో స్థానంలో యూజర్ తనకు నచ్చిన స్టిక్కర్‌ను అప్డేట్ చేయొచ్చు. ప్రస్తుతం యూజర్లు తమకు నచ్చిన ఫొటో లేదా బయటి నుంచి డౌన్లోడ్ చేసుకున్న అవతార్లను ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుంటున్నారు. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో యూజర్ తనకు నచ్చిన అవతార్ లేదా స్టిక్కర్‌ను వాట్సాప్‌లో క్రియేట్ చేసుకుని ప్రొఫైల్ ఫొటోగా మార్చుకోవచ్చు. యూజర్ డిజైన్ చేసిన స్టిక్కర్, అవతార్లను వ్యక్తిగత, గ్రూప్ చాటింగ్‌లో కూడా ఉపయోగించవచ్చు.
డాక్యుమెంట్‌కు క్యాప్షన్
వాట్సాప్ ద్వారా రోజూ ఎన్నో ఫైల్స్ పంపుతుంటాం. వాటిలో ఏదైనా ఫైల్ కావాల్సి వచ్చినప్పుడు చాట్ పేజీని పై నుంచి కిందకు స్క్రోల్ చేసి వెతికినా కొన్నిసార్లు కనిపించదు. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో యూజర్లు వాట్సాప్ ద్వారా పంపే డాక్యుమెంట్లకు తమకు నచ్చిన క్యాప్షన్ ఇచ్చి పంపవచ్చు. దానివల్ల భవిష్యత్తులో సదరు డాక్యుమెంట్ కోసం సెర్చ్ పేజీలో క్యాప్షన్‌ను టైప్ చేసి సులువుగా వెతకొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. -
డూప్లికేట్ ఫొటోలు పోయేలా..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్లలో డూప్లికేట్ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. -
నవ ఫీచర్ల వాట్సప్
నిత్య నూతన ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సప్ ఈ సంవత్సరమూ అంతే దూకుడును ప్రదర్శిస్తోంది. మొబైల్, వెబ్ వర్షన్లలో యూజర్ ఇంటరాక్షన్‌ను మెరుగు పరచటానికి బోలెడన్ని కొత్త ఫీచర్లను సిద్ధం చేస్తోంది. కొత్త సైడ్‌బార్‌తో పాటు డార్క్‌మోడ్‌ను తీర్చిదిద్దటం, వెబ్ క్లయింట్ నుంచి నేరుగా యూజర్‌నేమ్‌ను సృష్టించటం వంటి వాటికి అవకాశం కల్పించనుంది. -
తాత్కాలిక మెయిల్ కోసం
ఖాళీ సమయంలో గిగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండొచ్చు. మరేదైనా అవసరం కోసమో ఈమెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తొచ్చు. అయితే అదంత ముఖ్యమైన వ్యవహారం కాకపోవచ్చు. -
ఈ స్మార్ట్ఫోన్లు వాడుతున్నారా?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్లే. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. నివాస ప్రాంతం, బ్యాంకు వివరాల వంటి బోలెడంత వ్యక్తిగత సమాచారం వీటిల్లో నిక్షిప్తమవుతోంది. దీన్ని మోసగాళ్లకు చిక్కకుండా కాపాడుకోవటం తప్పనిసరైంది. అందుకే భద్రతను మెరుగుపరచటంలో భాగంగా ప్రభుత్వం అప్పుడప్పుడు హెచ్చరికలూ జారిచేస్తుంటుంది. -
వీడియో కాల్ చేస్తున్నా సంగీతం వినొచ్చు
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరించే వాట్సప్ మరో వినూత్న సదుపాయాన్ని తీసుకొస్తోంది. ఇది వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే పాటల వంటివి వినటానికీ వీలు కల్పిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు పరికరాల కోసమూ దీన్ని రూపొందిస్తున్నారు. దేని గురించైనా చర్చిస్తున్నప్పుడు వినోదం కోసం సంగీతం వినటం వంటి మల్టీమీడియా సదుపాయాల విషయంలో ఇది కొత్త దారులు తెరవగలదని భావిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
-
Viral Video: సర్కస్‌లో స్టంట్.. పట్టుతప్పి 12 అడుగుల ఎత్తు నుంచి జారిపడిన యువతి
-
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
-
Sadananda: కాంగ్రెస్‌లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం