WhatsApp Upcoming Features: కమ్యూనిటీస్‌లో సబ్‌గ్రూపులు.. గ్రూప్ మెసేజ్‌లో ప్రొఫైల్ ఫొటో!
యూజర్లకు అడ్వాన్స్డ్ ఫీచర్లు అందివ్వాలనే ఉద్దేశంతో వాట్సాప్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అవేంటో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ కోసం ఎక్కువ మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్లకు అడ్వాన్స్డ్ ఫీచర్లు అందివ్వాలనే ఉద్దేశంతో వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. అవేంటో చూద్దాం..
ప్రొఫైల్ డిస్ప్లే
వాట్సాప్ గ్రూపులో ఎవరైనా మెసేజ్ పంపితే, వాళ్ల ఫోన్ నంబర్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ అయితే ఎవరు పంపారనేది తెలుస్తుంది. ఒకవేళ కాంటాక్ట్ లిస్ట్‌లో లేకుంటే కేవలం వారి ఫోన్ నంబర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. కొత్తగా రాబోతున్న ఫీచర్‌తో గ్రూపులో మెసేజ్ పంపిన యూజర్ ప్రొఫైల్ ఫొటో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
నచ్చిన భాషలో యాప్
వాట్సాప్ ఉపయోగించే యూజర్లలో చాలా మంది యాప్ లాంగ్వేజ్‌తో ఇబ్బంది పడుతుంటారు. దీంతో పూర్తిస్థాయిలో ఫీచర్లు, సెట్టింగ్స్‌ను ఉపయోగించలేరు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా వాట్సాప్ లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయనుంది. దీంతో యూజర్లు యాప్ లాంగ్వేజ్‌గా తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. ఈ మేరకు యాప్ సెట్టింగ్స్‌లో చాట్ సెక్షన్లోకి వెళ్లి యాప్ లాంగ్వేజ్‌పై క్లిక్ చేసి అనుకూలమైన భాషను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
కమ్యూనిటీస్
వాట్సాప్‌లో కమ్యూనిటీస్ అనే మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఏప్రిల్‌లో వెల్లడించారు. దీంతో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా.. అని యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కమ్యూనిటీస్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పది గ్రూపులను క్రియేట్ చేయొచ్చు. వీటిని సబ్ గ్రూపులు అని పిలుస్తారు. దీంతో ఒకేసారి 512 మంది కమ్యూనిటీస్‌లో సభ్యులుగా ఉండొచ్చు. కమ్యూనిటీస్లోని సభ్యులు తమకు నచ్చిన సబ్ గ్రూపులలో సభ్యులుగా చేరొచ్చు. సబ్ గ్రూప్‌లను డిసేబుల్, ఎనేబుల్ చేసే అధికారం కమ్యూనిటీస్ అడ్మిన్‌కు ఉంటుంది. దాంతోపాటు సబ్ గ్రూపులోని సభ్యుల ఫోన్ నంబర్లు ఇతరులకు కనిపించకుండా గోప్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.
ఒక్క క్లిక్‌తో రికవరీ
వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ డిలీట్ చేస్తే వాటిని తిరిగి రికవరీ చేసుకునే అవకాశంలేదు. త్వరలో తీసుకురాబోతున్న ఫీచర్‌తో డిలీట్ చేసిన మెసేజ్, మీడియాఫైల్స్‌ను కూడా తిరిగి పొందవచ్చు. మెసేజ్ డిలీట్ చేసిన వెంటనే చాట్ స్క్రీన్ మీద మెసేజ్ డిలీటెడ్ (Message Deleted) లైన్‌తోపాటు అన్డూ (UNDO) అనే ఆప్షన్ కనిపిస్తుంది. అన్‌డూపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్ తిరిగి చాట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మెసేజ్ డిలీట్ చేసేప్పుడు యూజర్ డిలీట్ ఫర్ మీ (Delete For Me) అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అన్డూ ఆప్షన్ కనిపించదు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone) ఆప్షన్ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లకు మాత్రమే అన్డూ ఆప్షన్ చూపిస్తుంది.
స్క్రీన్‌షాట్ తీయలేరు..
వాట్సాప్‌లో వ్యూవన్స్ ఫీచర్ ద్వారా పంపే ఫొటో లేదా మీడియా ఫైల్స్‌ను ఒక్కసారి చూసిన తర్వాత వాటంతటవే డిలీట్ అవుతాయి. దీంతో సదరు ఫైల్‌కు సంబంధించి అవతలి వ్యక్తి వద్ద ఎలాంటి డిజిటల్ రికార్డులు ఉండవు. ఇది ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం. కానీ, కొద్దిమంది యూజర్లు వ్యూవన్స్ ద్వారా పంపిన ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నారు. ఇకపై వ్యూవన్స్ ద్వారా పంపే ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకోకుండా.. స్క్రీన్ షాట్ బ్లాకింగ్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
సైన్ఇన్ లేకుండానే ఛాట్‌జీపీటీ
ఛాట్‌జీపీటీని వాడుకోవాలంటే ముందు సైన్ఇన్ కావాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ను మరచిపోవటం వంటి సందర్భాల్లో ఇది కష్టంగా అనిపిస్తుంటుంది. -
ఎక్స్‌లో కమ్యూనిటీ నోట్స్
ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎక్స్ (ట్విటర్) మనదేశంలో కమ్యూనిటీ నోట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌కు కంట్రిబ్యూట్ చేయటానికి కొత్తవారికీ ఆహ్వానం పలికింది -
వైఫై పాస్వర్డ్ మరిచారా?
ఇంటికి వచ్చిన అతిథులో, పరిచయం ఉన్నవారో వైఫై పాస్వర్డ్ అడుగుతుంటారు. చాలాసార్లు అదేంటో గుర్తుకురాదు. మరెలా? చేతిలో ఫోన్ ఉంటే ఇట్టే తెలుసుకోవచ్చు. ఐఫోన్ వాడేవారైతే- సెటింగ్స్ ద్వారా వైఫై విభాగంలోకి వెళ్లాలి. -
సైబర్ నేరాలకు చక్షు కళ్లెం
మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల వంటి సైబర్ నేరాలను అరికట్టటానికి టెలికం విభాగం కొత్త పోర్టల్‌ను పరిచయం చేసింది. సంచార్ సాథీ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చిన దీని పేరు చక్షు. -
యాపిల్ పాడ్‌కాస్ట్‌లు అక్షరాల్లో..
పాడ్‌కాస్ట్‌లు ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే యాపిల్ సంస్థ పాడ్‌కాస్ట్‌లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవటానికి, వాటిల్లోని అంశాలను, విషయాలను తేలికగా కనుక్కోవటానికి ఓ వినూత్న ఫీచర్‌ను ప్రవేశపెట్టింది -
ఫొటోతోనే వీడియో..
షేక్స్పియర్ స్వగతాన్ని మోనాలిసా పాట రూపంలో పాడితే? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇలాంటి అద్భుతాలు ఎన్నయినా చేయొచ్చు -
చిటికెలో వెబ్సైట్
కొద్ది నిమిషాల్లో వెబ్‌సైట్‌ను సృష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే విక్స్ ఏఐ వెబ్సైట్ బిల్డర్ సాయం తీసుకోవచ్చు. ఇది ఏఐ ఛాట్‌బాట్ సాయంతో సెకండ్లలోనే వెబ్‌సైట్‌ను తయారుచేస్తుంది మరి. -
మన డ్రోన్ ఉపగ్రహం!
డ్రోన్ల గురించి తెలిసిందే. వేడుకల్లో వీడియోలు తీయటం దగ్గరి నుంచి పొలాల్లో మందులు చల్లటం వరకూ రకరకాల పనులకు ఉపయోగపడుతున్నాయి. మరి ఇవి ఉపగ్రహం మాదిరిగానూ పనిచేస్తే? అలా ఉపయోగపడగల మానవరహిత బుల్లి విమాన వాహనాన్ని (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్- యూఏవీ) బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్ (ఎన్ఏఎల్) గతవారం విజయవంతంగా పరీక్షించింది. -
వాట్సప్‌లో ఫేవరెట్స్ ట్యాబ్
వాట్సప్ ఛాట్స్ జాబితాలో ఇష్టమైన కాంటాక్టులను కనుక్కోవటం కష్టంగా ఉందా? త్వరలోనే దీనికి పరిష్కారం లభించనుంది. కొత్తగా ఫేవరెట్స్ ట్యాబ్‌ను పరిచయం కానుంది. దీన్ని ప్రస్తుతం ఐఓఎస్, వెబ్ యూజర్ల కోసం పరీక్షిస్తున్నారు. -
ఎక్స్ క్యాచీ శుభ్రం
ఎక్స్ (ట్విటర్) మొబైల్ యాప్ ఫోన్లో, ట్యాబ్లెట్లో క్యాచ్డ్ ఫైళ్లను నిల్వ చేస్తుందని తెలుసా? ఒకవేళ ఫోన్లో స్టోరేజీ నిండుకుంటున్నట్టయితే ఎక్స్ వెబ్, మీడియా క్యాచీని తొలగించుకోవటం తేలికైన, సత్వర పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. -
టెక్ చిట్కాలు
ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇకపై బయోలో ఐదు లింకుల వరకు యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో లాగిన్ అయ్యాక అకౌంట్ సెటింగ్స్‌ను ఓపెన్ చేయాలి. మన ఫొటో దిగువన ఉండే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్లి యాడ్ లింకును క్లిక్ చేయాలి. షేర్ చేయాలనుకునే లింకు జత చేసుకుంటే సరి. -
ప్రైవసీ విధాన వివరాలు తేలికగా ..
వెబ్సైట్లకు ప్రైవసీ పాలసీలు ఉండటం తెలిసిందే. వీటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ఆయా విధానాలను చదవాలన్నా పెద్దగా ఉంటాయి. -
యూట్యూబ్ వీడియో ఆడియోగా మారితే
యూట్యూబ్ అంటే ఎప్పుడూ చూడటమేనా? రేడియో మాదిరిగా పాటలు, సంగీతాన్ని వినలేమా? కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. వీడియోలను ఆడియో ఫైళ్లుగా సేవ్ చేసుకుంటే ఇది సాధ్యమే -
సోషల్ ఖాతా హ్యాక్ అయితే?
ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్.. ఇలా ఎన్నెన్నో సామాజిక మాధ్యమాలు. అభిప్రాయాలు పంచుకోవటానికైనా.. చుట్టుపక్కల సమాచారాన్ని తెలుసుకోవటానికైనా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
అనవసర జీమెయిళ్ల తొలగింపు తేలికగా
అనవసర ఈమెయిళ్లు చాలా చికాకు కలిగిస్తాయి. రోజురోజుకీ ఇన్‌బాక్స్‌లో నిండిపోతూ వస్తుంటాయి. కొన్నిసార్లు వీటిని డిలీట్ చేయటానికే సమయమంతా వెచ్చించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. -
మెయిల్‌కు జవాబు మరుస్తుంటే?
మెయిల్‌ను చదువుతాం. తర్వాత జవాబిద్దామని అనుకుంటాం. తీరా మరచిపోతాం. ఎప్పటికో గానీ గుర్తుకురాదు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాం కదా. -
ఫోన్ టైపింగ్ వేగంగా
స్మార్ట్‌ఫోన్‌లో వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే టెక్స్ట్ రిప్లేస్మెంట్ సాయం తీసుకోండి. దీంతో పెద్ద పదబంధాలకు షార్ట్‌కట్స్‌ను సెట్ చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది. -
స్నాప్‌చాట్ లైవ్ లొకేషన్‌తో భద్రం
మీ పిల్లలు స్నాప్‌ఛాట్ వాడుతున్నారా? కాస్త జాగ్రత్త. దీనిలోని లైవ్ లొకేషన్ ఫీచర్‌ను కొందరు దుర్వినియోగం చేయొచ్చు. పిల్లలు ఎక్కడున్నారో గుర్తించొచ్చు. -
మన మెయిల్ మనకే!
కొత్త సంవత్సరంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? వాటిని ఎంతవరకు సాధించారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ఎంతైనా మేలు చేస్తుంది. ఇంకా చేయాల్సిందేంటి? ఎలా చేయాలి? అనేవి నిర్ణయించుకోవటానికి వీలవుతుంది -
ఛాట్‌జీపీటీకి సమాచారమా?
ఛాట్‌జీపీటీ వాడుతున్నారా? దీనికి వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఛాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్ ఏఐ నమూనాలకు తర్ఫీదు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!