WhatsApp: ఫేస్‌బుక్‌ తరహాలో వాట్సాప్‌ కవర్‌ ఫొటో!

యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ వాట్సాప్‌ ఫేస్‌బుక్‌ తరహాలో కొత్తగా కవర్‌ పేజీ ఇమేజ్‌ను..

Updated : 14 Feb 2022 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ వాట్సాప్‌ ఫేస్‌బుక్‌ తరహాలో కొత్తగా కవర్‌ పేజీ ఇమేజ్‌ను తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వాట్సాప్‌ ప్రొఫైల్‌లో కవర్‌ ఫొటోను సెట్‌ చేసుకునే కొత్త ఫీచర్‌పై కంపెనీ పని చేస్తున్నట్లు వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌లో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను ప్రారంభించినప్పుడు ప్రొఫైల్‌ సెట్టింగ్‌లో స్వల్ప మార్పులు గమనించవచ్చని పేర్కొంది.

అలాగే వాట్సాప్‌ వ్యాపార వినియోగదారుల ప్రొఫైల్‌ సెట్టింగ్‌లో కెమెరా బటన్‌ పరిచయం చేయాలని భావిస్తోంది. తద్వారా వినియోగదారులు ఉన్న ఫొటోను లేదా కొత్తదాన్ని కవర్ ఫొటోగా ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాంటాక్ట్ లిస్ట్‌లోని యూజర్లు మీ వ్యాపార ప్రొఫైల్‌ను సందర్శించినప్పపుడు..  ప్రొఫైల్ ఫొటోతో పాటు కవర్ ఫొటోను కూడా చూసే వీలుంటుంది.

మరోవైపు కొత్తగా రాబోయే అప్‌డేట్‌లో ‘కమ్యూనిటీ’ ఫీచర్‌ను వాట్సాప్‌ విడుదల చేసే అవకాశం ఉంది. వాట్సాప్ కమ్యూనిటీ అనేది గ్రూప్ చాట్ లాంటిదే. కమ్యూనిటీలో ఇతర గ్రూప్‌లను లింక్‌ చేసుకోవచ్చు. అయితే, గరిష్టంగా 10 గ్రూప్‌లను మాత్రమే లింక్‌ చేసుకొనే వీలుంటుందట. కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉన్నవాళ్లు కమ్యూనిటీలో ఉన్న అన్ని గ్రూప్స్‌లోకి కూడా మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంది. గ్రూప్స్‌లోలానే కమ్యూనిటీ అడ్మిన్‌లు ఇతరులను ఇన్వైట్‌ లింక్‌, క్యూఆర్‌ కోడ్ లేదా మాన్యువల్‌గా కమ్యూనిటీలలోకి ఆహ్వానించవచ్చు. అయితే, కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్‌లకు మెసేజ్‌ పంపలేరు. కమ్యూనిటీ సభ్యులకు ఇతర సభ్యులతో సంభాషించాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీ అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వాబీటాఇన్ఫో తెలిపింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని