WhatsApp: మార్చి 31 నుంచి ఈ మొబైల్స్‌లో వాట్సాప్‌ పనిచేయదు!

మార్చి 31 నుంచి కొన్ని పాత స్మార్ట్‌ఫోన్స్‌ మోడల్స్‌లో వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. మరి ఆ ఫోన్ల జాబితా ఏంటో చూసేయండి.

Updated : 11 May 2022 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ ఎప్పటికప్పుడు పాత స్మార్ట్‌ఫోన్ల మాడల్స్‌లో  తన సేవల్ని నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో జాబితాను వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా విడుదల చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, కాయ్‌ ఓఎస్‌ల్లోని కొన్ని వెర్షన్‌లో వాట్సాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. మార్చి 31 నుంచి ఆ ఫోన్‌ మోడల్స్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయని కంపెనీ తెలిపింది.

ఆండ్రాయిడ్‌ 4.0, అంతకంటే తక్కువ వెర్షన్‌లో ఇక వాట్సాప్‌ పనిచేయదు. అలాగే ఐఓఎస్‌ 10 అంతకంటే పై వెర్షన్‌లోని మోడల్స్‌లో మాత్రమే వాట్సాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్‌ 2.5 వెర్షన్‌ కంటే తక్కువగా ఉన్న మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కంపెనీ కొన్ని ఫోన్‌ మోడళ్ల పేర్లతో జాబితాను విడుదల చేసింది. అందులో ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్‌, ఎల్‌జీ వంటి ప్రముఖ బ్రాండ్‌లతోపాటు షావోమీ,  హువావే వంటి మోడల్స్‌ కూడా ఉన్నాయి.

శాంసంగ్‌:

శాంసంగ్‌ కంపెనీ గతంలో విడుదల చేసిన గెలాక్సీ ట్రెండ్‌ లైట్‌, గెలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్‌ 2, గెలాక్సీ కోర్‌ వంటి మోడల్స్‌లో మార్చి 31 తర్వాత వాట్సాప్‌ పనిచేయదు. 

ఎల్‌జీ:

ఎల్‌జీ కంపెనీకి చెందిన ఆప్టిమస్‌ సిరీస్‌లో ఎఫ్‌3, ఎఫ్5, ఎఫ్‌6, ఎఫ్‌7, ఆప్టిమస్‌ ఎల్‌3 II డ్యూయల్‌, ఎల్‌4 II డ్యూయల్, ఆప్టిమస్‌ ఎల్ II, ఎఫ్‌5 II, ఎఫ్‌5 II డ్యూయల్‌, ఎఫ్‌7 II, ఎఫ్‌7 II డ్యూయల్‌, ఎల్‌జీ ఎన్‌ఆక్ట్‌, ఆప్టిమస్‌ ఎల్‌2 II, ఆప్టిమస్‌ ఎఫ్‌3క్యూ మోడల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 
 
మోటోరోలా:

మోటోరోలా డ్రాయిడ్‌ రాజర్‌ మోడల్స్‌ అమ్మకాలు భారత్‌లో నిలిచిపోయాయి. అయినప్పటికీ ఎవరైనా ఇంకా ఈ మోడల్స్‌ ఉపయోగిస్తున్నట్లయితే  ఆయా మోడల్స్‌లో ఇక వాట్సాప్ పనిచేయదు.

షావోమీ:

షావోమి కంపెనీ తీసుకొచ్చిన హంగ్ఎంఐ, ఎంఐ2ఏ, రెడ్‌మీ నోట్‌ 4జీ, హంగ్ఎంజీ 1ఎస్‌ వంటి మోడళ్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. 

హువావే:

హువావే గతంలో విడుదల చేసిన అసెండ్‌ డీ, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, అసెండ్‌ డీ1, క్వాడ్‌ ఎక్స్‌ఎల్‌, అసెండ్‌ పీ1 ఎస్‌ లాంటి మోడళ్లలోనూ వాట్సాప్‌ పనిచేయదని వాట్సప్‌ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని