WhatsApp: ఇక టెక్స్ట్‌తో పనిలేదు.. నేరుగా ఫీలింగ్‌ చెప్పొచ్చు!

వాట్సాప్‌ త్వరలో ‘మెసేజ్‌ రియాక్షన్‌ (message reactions)’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో.. 

Updated : 25 Feb 2022 22:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తోంది వాట్సాప్‌. కొత్తగా సెర్చ్‌ మెసేజ్‌ షార్ట్‌కట్‌పై వాట్సాప్‌ పనిచేస్తున్నట్లు వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) పేర్కొంది. అలాగే వాట్సాప్‌ త్వరలో ‘మెసేజ్‌ రియాక్షన్‌ (message reactions)’ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ చాట్‌ బాక్స్‌లో ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉండగా, వాట్సాప్‌లోనూ ఈ ఫీచర్‌ తీసుకొచ్చేందుకు మెటా కసరత్తు ప్రారంభించింది.

మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌ ద్వారా.. టెక్స్ట్‌తో పనిలేకుండా గ్రూప్‌, వ్యక్తిగతంగా వచ్చే మెసేజ్‌లపై ఎమోజీల ద్వారానే నేరుగా ప్రతిస్పందివచ్చు. ఈ మేరకు మెసేజ్‌పై పక్కనే ఉన్న ఎమోజీ బటన్‌ ఫీచర్‌లో ఆరు ఎమోజీలు ఉంటాయి. వాటిని ఉపయోగించి టెక్స్ట్‌ను టైప్ చేయకుండానే సదరు మెసేజ్‌పై మీ ఫీలింగ్ ఎంటో చెప్పవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్‌ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షించగా, తాజాగా డెస్క్‌టాప్‌ బీటా యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని బట్టి చూస్తే మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌ అందరికీ ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ‘సెర్చ్‌ మెసేజ్‌ షార్ట్‌కట్‌ (search message shortcut)’ విషయానికొస్తే..  వాట్సాప్ కొన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు సెర్చ్ మెసేజ్‌ షార్ట్‌కట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మెసేజ్‌ను నేరుగా శోధించడానికి కాంటాక్ట్‌ ఇన్ఫో పేజీని వాట్సాప్‌ రీడిజైన్‌ చేసింది. అయితే, ఇతర ఫీచర్లు మాదిరే ఇవీ అభివృద్ధి దశలోనే ఉన్నందున.. వీటిని కచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారన్నది వాట్సాప్‌ నుంచే వెల్లడి కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని