WhatsApp: వాట్సాప్‌లో త్వరలో మరిన్ని ఎమోజీ రియాక్షన్స్‌!

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో త్వరలో మరిన్ని ఎమోజీ రియాక్షన్స్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

Updated : 11 May 2022 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఆకర్షణీయంగా మారుతోంది. తాజాగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలో త్వరలో మరిన్ని ఎమోజీ రియాక్షన్స్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఇక యూజర్లు వచ్చే మెసేజ్‌లకు డిఫరెంట్‌ ఎమోజీలతో రిప్లే ఇవ్వొచ్చు. అయితే, ఈ ఫీచర్‌ మొదట వాట్సాప్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. అనంతరం ఇతర వాట్సాప్‌ యూజర్లకు అందుబాటులోకి తెస్తుందని వాబీటాఇన్ఫో పేర్కొంది. ఈ అప్‌డేట్‌ డెస్క్‌టాప్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.

వాబీటాఇన్ఫో ప్రకారం.. ప్రస్తుతం వాట్సాప్‌ లైక్, లవ్, లాఫ్, ఆశ్చర్యం, విచారం, ధన్యవాదాలు అనే ఆరు ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. యూజర్ల కోరిక మేరకు ఈ రియాక్షన్స్‌కు అదనంగా మరిన్ని ఎమోజీలను తీసుకురావాలని వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు తెలిపింది. కాగా.. బీటా యూజర్ల కోసం ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ యాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ గతేడాది ఆగస్టులోనే ఈ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని