WhatsApp: వాట్సాప్‌లో డిలీట్‌ చేసిన మెసేజ్‌ను.. త్వరలో ‘అన్‌డు’ చేయొచ్చు‌!

రాబోయే అప్‌డేట్‌లో వాట్సాప్‌ ‘అన్‌డు మెసేజ్‌ డిలీటేషన్‌’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే చాట్‌లో అనుకోకుండా డిలీట్‌ చేసిన మెసేజ్‌లను..

Published : 03 Jun 2022 21:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. తాజాగా మరో ఫీచర్‌పై దృష్టి పెట్టింది. వినియోగదారులకు మెరుగైన మెసేజింగ్‌ అనుభవాన్ని అందించడానికి భవిష్యత్ అప్‌డేట్‌లో ‘అన్‌డు మెసేజ్‌ డిలీటేషన్‌ (undo message deletion)’ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే చాట్‌లో అనుకోకుండా డిలీట్‌ చేసిన మెసేజ్‌లను మళ్లీ రీస్టోర్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ ‘వాబీటా ఇన్ఫో’ ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేసింది.

ఎలా పనిచేస్తుందంటే..?

 చాట్‌లో మెసేజ్‌ను డిలీట్‌ చేసిన తర్వాత స్క్రీన్ కింది భాగాన వాట్సాప్‌ వెంటనే స్నాక్‌బార్‌ని ప్రదర్శిస్తుంది. మెసేజ్‌ను అనుకోకుండా డిలీట్‌ చేస్తే.. ఈ స్నాక్‌బార్‌పై క్లిక్‌ చేయగానే మెసేజ్‌ డిలీట్‌ రద్దువుతుంది. ఇలా సెకన్ల వ్యవధిలోనే మెసేజ్‌ను రీస్టోర్‌ చేసుకునే వీలుంటుంది. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారన్నది వాట్సాప్‌ నుంచే స్పష్టత రావాల్సి ఉంది. ఆండ్రాయిడ్‌తోపాటు డెస్క్‌టాప్‌, ఐవోస్‌ వెర్షన్‌లోనూ ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. మరోవైపు, ముందుగా పంపిన మెసేజ్‌లను సవరించడానికి అనుమతించే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్‌ పనిచేస్తోంది. ఇందుకోసం త్వరలో మెసేజ్‌ ‘ఎడిట్‌’ బటన్‌ను తీసుకురానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని