WhatsApp: కమ్యూనిటీస్ - గ్రూప్స్ మధ్య వ్యత్యాసం ఇదే!
వాట్సాప్ కొత్తగా పరిచయం చేసిన కమ్యూనిటీస్‌కు, గతంలో తీసుకొచ్చిన గ్రూప్‌లకు మధ్య తేడాను వివరించాలని గత కొద్దిరోజులుగా యూజర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ రెండింటి ఫీచర్లను వివరిస్తూ వీడియోను విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ ఇటీవల కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు 20 గ్రూపులను ఒకేచోటుకి తీసుకురావచ్చు. ఆఫీస్ లేదా హౌసింగ్ సొసైటీల్లో చాలా మంది తమ పరిచయస్తులు, సహోద్యోగులతో కలిసి గ్రూపులను నిర్వహిస్తుంటారు. అలాంటి వాటన్నింటినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు కమ్యూనిటీస్‌ను డెవలప్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ విడుదలైన తర్వాత చాలా మంది యూజర్లు గ్రూప్స్‌తో కమ్యూనిటీస్‌ను పోలుస్తూ.. రెండింటికి మధ్య వ్యత్యాసం గురించి చెప్పాలని ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ కమ్యూనిటీస్, గ్రూప్స్ మధ్య ఉన్న తేడాను వివరిస్తూ వీడియోను విడుదల చేసింది.
గ్రూప్స్ (Groups)
స్నేహితులు, కుటుంబసభ్యులు, ఆఫీస్‌లో సహోద్యోగులతో మెసేజ్, ఆడియో/వీడియోలు షేర్ చేసేందుకు, ఒకేసారి ఎక్కువమందితో చాట్ చేసేందుకు గ్రూప్స్ ఉపయోగపడుతుంది. ఇందులో 1024 మంది సభ్యులుగా ఉండొచ్చు. గ్రూప్ సంభాషణలకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది. ఇందులో ఎవరైనా ఇన్వైట్ లింక్, క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేదా అడ్మిన్ అనుమతితో గ్రూప్‌లో సభ్యులుగా చేరొచ్చు.
కమ్యూనిటీస్ (Communities)
స్కూళ్లు, కాలేజీలు, అపార్ట్‌మెంట్ వంటి ప్రదేశాల్లో సెక్షన్లు, బ్లాక్‌ల వారీగా గ్రూప్‌లను క్రియేట్ చేస్తారు. వాటిలో ఏదైనా సమాచారం షేర్ చేసుకోవాలంటే ప్రతి గ్రూప్‌ను సెలెక్ట్ చేసి ఫార్వార్డ్ చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీస్‌ను పరిచయం చేశారు.
20 గ్రూప్‌లను ఒకేసారి కమ్యూనిటీస్‌లోకి తీసుకురావచ్చు. దీంతో కమ్యూనిటీస్ అడ్మిన్ ఏదైనా సమాచారాన్ని షేర్ చేస్తే 20 గ్రూప్‌లలో ఉన్న సభ్యులందరికీ తెలుస్తుంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువ మందితో సమాచారాన్ని సులువుగా షేర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వాట్సాప్ తెలిపింది. గ్రూప్స్ తరహాలోనే ఇందులో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుంది. దాంతోపాటు ఒక గ్రూప్‌లోని సభ్యులు మరొక గ్రూప్ సభ్యులతో సంభాషించాలా? వద్దా? అనేది కూడా కమ్యూనిటీస్ అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!