Windows 11: విండోస్‌ 11లో కొత్త తరహా టైపింగ్‌.. వారికి మాత్రమే!

విండోస్‌ 11 తాజా అప్‌డేట్‌లో మరో ఆసక్తికర యాక్సెసిబిలిటీ ఫీచర్‌ ఇప్పుడు ఆకట్టుకుంటోంది. వాయిస్‌ కమాండ్స్‌తో పీసీని..

Published : 24 Jan 2022 18:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దృష్టి లోపం, చేతుల్లో సమస్య ఉన్న దివ్యాంగుల కోసం మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తోంది. వాయిస్‌ కమాండ్స్‌తో పని చేసేలా కీబోర్డును అప్‌డేట్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ 11 (Windows 11)ను ఇటీవల యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని బీటావెర్షన్‌లోనే ఈ కొత్త ఆప్షన్‌ కనిపించింది. ఇన్‌సైడర్‌ ప్రోగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ (22538) ద్వారా వర్చువల్ కీబోర్డ్‌కు మరిన్ని సౌకర్యాలను జోడించింది. ఇప్పటికే సిస్టమ్‌లో ఉన్న వర్చువల్‌ కీబోర్డుకు ఈ ఫీచర్‌ను యాడ్‌ చేసింది.

వర్చువల్‌ కీబోర్డులో ప్రతి కీకి ఓ నెంబరును కేటాయించారు. అలా బటన్స్‌కు 1 నుంచి 49 వరకు నంబర్లు ఉంటాయి. ఉదాహరణకు మీ ‘R’ అనే అక్షరాన్ని టైప్‌ చేయాలంటే ‘క్లిక్‌ ఆన్‌ 4’ అని ఇంగ్లిష్‌లో కమాండ్‌ చెప్పాలి. అప్పుడు మీరు ఎంచుకున్న ప్రదేశంలో ఆ అక్షరం టైప్‌ అవుతుంది. అలాగే వర్చువల్‌ కీబోర్డును తెరవడానికి, మూసివేయడానికి కూడా కొన్ని కమాండ్స్‌ ఇచ్చారు. తెరవాలంటే ‘ఓపెన్‌ ది వర్చువల్‌ కీబోర్డు’... క్లోజ్‌ చేయాలంటే ‘హైడ్‌ ది వర్చువల్‌ కీబోర్డు’ అని కమాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

వాయిస్‌ కమాండ్స్ ఇచ్చే సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి Redmond కంపెనీ స్పీచ్‌ ప్యాక్‌ అప్లికేషన్లను మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు ‘బిల్డ్ 22538’లో ఆధునిక టాస్క్ మేనేజర్, బగ్ పరిష్కారాలతో పాటు లైట్‌, డార్క్‌ మోడ్‌లో పనిచేసేలా టాస్క్‌ మేనేజర్‌ వంటి ఇతర కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిని ఇన్‌స్టాల్ చేయాలంటే ముందుగా Windows Insiders ప్రోగ్రామ్‌లో జాయిన్‌ కావాల్సి ఉంటుంది. త్వరలో ఈ ఫీచర్లు లైవ్‌ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని