Power Bank: ఈ పవర్‌ బ్యాంక్‌తో 5వేల ఫోన్లు ఛార్జ్‌ చేయొచ్చు!

ప్రయాణాల సమయంలో మనకు ఎదురయ్యే సమస్యల్లో మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ ఒకటి. అన్ని చోట్ల ఛార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. అందుకే, పవర్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తుంటాం. వాటిలో 10వేల ఎంఏహెచ్‌ నుంచి దాదాపు లక్ష.. 2లక్షల ఎంఏహెచ్‌ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే,

Published : 04 Feb 2022 02:25 IST


(ఫొటో: హ్యాండీ జెంగ్‌ యూట్యూబ్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణాల సమయంలో మనకు ఎదురయ్యే సమస్యల్లో మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ ఒకటి. అన్ని చోట్ల ఛార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. అందుకే, పవర్‌ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తుంటాం. వాటిలో 10వేల ఎంఏహెచ్‌ నుంచి దాదాపు లక్ష.. 2లక్షల ఎంఏహెచ్‌ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 2.7కోట్ల ఎంఏహెచ్‌ సామర్థ్యమున్న భారీ పవర్‌బ్యాంక్‌ను తయారు చేశాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పవర్‌ బ్యాంక్‌.

చైనాకు చెందిన టెక్‌ నిపుణుడు.. సోషల్‌మీడియా ఇన్‌ప్ల్యూన్సర్ హ్యాండీ జెంగ్‌ ఈ పవర్‌బ్యాంక్‌ను రూపొందించాడు. దీనితో 3వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యమున్న 5వేల మొబైల్స్‌ను ఛార్జ్‌ చేయొచ్చట. 5.9 X 3.9 అడుగుల సైజులో ఉన్న ఈ భారీ పవర్‌ బ్యాంక్‌లో ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి వీలుగా మొత్తం 60 పోర్ట్స్‌ ఉన్నాయి. 220వాల్ట్స్‌ వోల్టేజ్‌ను కూడా ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఈ పవర్‌ బ్యాంక్‌తో టీవీ, వాషింగ్‌ మిషన్‌ను వాడుకోవచ్చని, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సైతం ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చని జెంగ్‌ చెబుతున్నాడు. ఈ పవర్‌ బ్యాంక్‌ను వెంట తీసుకెళ్లడం అంత సులువేం కాదండోయ్‌. దీన్ని మోయడానికి బాహుబలి లేదా రాఖీభాయ్‌ అవతారం ఎత్తాల్సివస్తుంది. దీని బరువుతోపాటు.. సైజు భారీగా ఉండటంతో చేతులతో మోసుకెళ్లే వీలు లేదు. అందుకే, జెంగ్‌ దీనిని లాక్కెళ్లేలా  చక్రాలు అమర్చాడు. ఈ పవర్‌ బ్యాంక్‌ను తయారు చేసిన విధానాన్ని చూపిస్తూ ఓ వీడియో రూపొందించి తన యూట్యూబ్‌లో ఛానల్‌లో పోస్టు చేశాడు. ఇదే కాదు.. ఎలక్ట్రానిక్‌ వస్తువులతో అనేక వినూత్న ఆవిష్కరణలు చేస్తుంటాడు జెంగ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని