18 జీబీ ర్యామ్: ప్రపంచంలోనే తొలిసారి
ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సైజ్ ర్యామ్ ఉన్న తొలి మొబైల్ ఇదే.
ఇంటర్నెట్ డెస్క్: ‘మీ మొబైల్‌లో ర్యామ్ ఎంత?’ - ఇటీవల కాలంలో ‘కొత్త ఫోన్ కొన్నాం’ అనగానే వాటి మీద అవగాహన ఉన్నవాళ్లు అడుగుతున్న మాట ఇదీ! అంతగా ర్యామ్ ప్రాముఖ్యత పెరిగిపోయింది. అదే గేమింగ్ ఫోన్ విషయానికొస్తే ‘ర్యామ్’ అత్యంత కీలకం. అందుకే ఏటా మొబైల్ కంపెనీలు ర్యామ్ సైజును పెంచుతూ పోతున్నాయి. తాజాగా 18 జీబీ ర్యామ్‌తో ఓ మొబైల్ లాంచ్ అయ్యింది. గేమింగ్ కోసం నుబియా ప్రత్యేకంగా రూపొందించే ‘రెడ్ మ్యాజిక్’ సిరీస్‌లో ఈ మొబైల్ వచ్చింది. ప్రపంచంలోనే ఇంత ఎక్కువ సైజ్ ర్యామ్ ఉన్న తొలి మొబైల్ ఇదే. పేరు రెడ్ మ్యాజిక్ 6.
రెడ్ మ్యాజిక్ 6, రెడ్ మ్యాజిక్ 6 ప్రో పేరుతో రెండు మొబైల్స్‌ను శుక్రవారం నుబియా లాంచ్ చేసింది. వీటిలో 6.8 అంగుళాల తాకే తెర అమర్చారు. సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్ ఉంటాయి. 165 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉన్న ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 500 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మల్టీ టచ్‌లో 360 హెర్జ్ ఉంటుంంది. స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 888 అమర్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి సపోర్టు చేస్తుంది. ఎల్‌పీడీడీఆర్ 5 ర్యామ్, 3.1 యూఎఫ్‌ఎస్ స్టోరేజీ ఇస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే... వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా.. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
ఈ మొబైల్‌లో బ్యాటరీ కూలింగ్ కోసం చిన్న ఫ్యాన్‌ను కూడా ఇస్తున్నారు. రోజుకు మూడు గంటల పాటు వాడితే.. 10 వేల రోజులు ఈ ఫ్యాన్ పని చేస్తుందట. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుందట. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చేయొచ్చు. రెడ్‌మ్యాజిక్ 6లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. 8 జీబీ/12 జీబీ/16జీబీ/18 జీబీ ర్యామ్‌లతో మొబైల్స్ సిద్ధం చేశారు. 128 జీబీ/256జీబీ/512 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయి. రెడ్ మ్యాజిక్ 6... ₹43 వేల ప్రారంభ ధరతో తీసుకొస్తున్నారు. 6 ప్రో ప్రారంభ ధర ₹50 వేలు. (మన మార్కెట్‌కి వచ్చేసరికి మొబైల్ ధరల్లో మార్పులు ఉండొచ్చు). ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్‌లోకి ఈ మొబైల్స్ విక్రయానికి రానున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IndiGo: పట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడు ఉదయ్‌పుర్‌కు.. ‘ఇండిగో’లో ఘటన!
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!