Motorola: ప్రపంచంలోనే తొలిసారి.. మోటో నుంచి 200 మెగాపిక్సల్‌ ఫోన్‌!

Worlds First Smartphone With a 200 MP Camera:  200 మెగాపిక్సల్‌ సెన్సర్‌లో ఓ ఫోన్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది మోటోరొలా.

Published : 28 Jul 2022 21:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2MP.. 5MP.. 8MP.. స్మార్ట్‌ఫోన్‌ వచ్చిన తొలినాళ్లలో కెమెరాల పరిస్థితి ఇదీ. ఒకప్పుడు పది మెగాపిక్సల్‌ దాటితే అబ్బురపడేవారు. కానీ, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లలో 50 ఎంపీ కెమెరా సర్వసాధారణమైపోయింది. ఈ తరుణంలో ఏకంగా 200 మెగాపిక్సల్‌ సెన్సర్‌లో ఓ ఫోన్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది మోటోరోలా. మోటో X30 Pro పేరిట దీన్ని తీసుకురానుంది. 200 మెగాపిక్సల్‌తో ప్రపంచంలో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే. ఆగస్టు 2న చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు మోటో ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మోటోరోలా అధికారికంగా పంచుకోగా.. మరికొన్ని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. స్నాప్‌డ్రాగన్‌ 8+ జన్‌1 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఇందులో ఇస్తున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్‌ 12తో వచ్చే ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్‌ ఉంటుందని, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తారని సమాచారం. మరి ఈ ఫోన్‌ ధర ఎంత ఉంటుంది? పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. భారత్‌కు సైతం ఈ ఫోన్‌ తీసుకొస్తారని సమాచారం. మొత్తానికి ఈ కెమెరా ఫోన్‌తో టెక్‌ ప్రపంచం చూపును మరోసారి మోటోరోలా తనవైపు తిప్పుకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు