Xiaomi 11i: షావోమి కొత్త ఫోన్లు.. 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్
షావోమి మిడ్-రేంజ్ శ్రేణిలో రెండు కొత్త 5జీ ఫోన్లలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ల ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఇంటర్నెట్‌డెస్క్: షావోమి (Xiaomi) కంపెనీ మిడ్-రేంజ్ శ్రేణిలో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. షావోమి 11ఐ (Xiaomi 11i), షావోమి 11ఐ హైపర్ ఛార్జ్ (Xiaomi 11i HyperCharge) అనే రెండు వేరియంట్లలో వీటిని పరిచయం చేసింది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఓఎస్‌తో పనిచేస్తాయి. ఈ ఫోన్ల ధర, ఫీచర్లు, అమ్మకాలు వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.
బ్యాటరీ ఛార్జింగ్ ప్రాధ్యానంగా కంపెనీ ఈ ఫోన్లలను తీసుకొచ్చింది. షావోమి 11ఐ హైపర్ ఛార్జ్ మోడల్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇక సాధారణ 11ఐ మోడల్‌లో 5,160 బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 360 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ కోసం రెండు డాల్బీ అట్‌మోస్ స్పీకర్లు ఇస్తున్నారు.
షావోమి 11ఐ సిరీస్ ఫోన్లలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో లెన్స్ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
ఈ ఫోన్లలను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. షావోమి 11ఐ 6 జీబీ ర్యామ్/128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999, 8 జీబీ/256 జీబీ ధర రూ. 26,999. షావోమి 11ఐ హైపర్ ఛార్జ్ 6 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ. 26,999, 8 జీబీ/256 జీబీ ధర రూ. 28,999గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 12 నుంచి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఎమ్‌ఐ, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
mr pregnant ott release: సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Bhimavaram: భీమవరంలో దారుణం.. ఏడో తరగతి బాలికపై హత్యాచారం
-
HP Chromebooks: గూగుల్‌తో హెచ్‌పీ జట్టు.. భారత్‌లోనే క్రోమ్ బుక్స్ తయారీ
-
Housing sales: జులై- సెప్టెంబరులో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాలు: అనరాక్
-
Punjab: వ్యక్తి కడుపులో ఇయర్‌ఫోన్స్, నట్లు, బోల్టులు.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
-
Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం