Xiaomi 11i: షావోమి కొత్త ఫోన్‌.. 15 నిమిషాల్లోబ్యాటరీ ఫుల్‌ఛార్జ్‌

షావోమి 11ఐ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 6న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. మరి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు పరిచయం చేయనుంది, ధరెంత వంటి వివరాలు తెలుసుకుందాం.

Published : 22 Dec 2021 22:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొంటున్నామంటే బ్యాటరీ, ర్యామ్‌ స్పీడ్, స్టోరేజ్‌, డిస్‌ప్లే, కెమెరా ఇలా ఎన్నో ఫీచర్ల గురించి వాకబు చేస్తాం. అయితే ఫోన్ వినియోగం పెరిగిపోవడం.. ఎక్కువసేపు ఛార్జింగ్ అవసరం ఉండటంతో బ్యాటరీ కెపాసిటీపై ఎక్కువ మంది కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్నారు. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు అధిక బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో ఫోన్లను తీసుకొస్తున్నాయి. షావోమి కంపెనీ జనవరి 6న విడుదల చేయనున్న షావోమి 11ఐ ఫోన్‌లో హైపర్ ఛార్జింగ్‌ టెక్నాలజీని పరిచయం చేయనుంది. 120 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో కేవంల 15 నిమిషాల్లోనే 100 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని షావోమి కంపెనీ చెబుతోంది. 5జీ కనెక్టివిటీ ఫీచర్‌తో షావోమి 11ఐ ఫోన్‌ను తీసుకురానుంది. 

షావోమి 11ఐ ఫీచర్లు

ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు వెనుకవైపు మొత్తం మూడు కెమెరాలు ఉంటాయి. డ్యూయల్‌ జేబీఎస్‌ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. షావోమి 11ఐ మోడల్‌ను 6 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ, 8 జీబీ/256 జీబీ వేరియంట్లలో తీసుకురానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 22,500 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. పూర్తి వివరాలు తెలియాలంటే జనవరి 6 వరకు వేచిచూడాల్సిందే. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని