Xiaomi MIUI 13: షావోమి కొత్త ఓఎస్‌.. ముందుగా ఈ ఫోన్లలోనే!

షావోమి కొత్త ఓఎస్‌ ఎమ్‌ఐయూఐ 13ను భారత్‌లో యూజర్లకు పరిచయం చేసింది. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ఏయే ఫోన్లలో ఎప్పుడు అప్‌డేట్ అవుతుందనేది చూద్దాం. 

Published : 03 Feb 2022 23:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎదురుచూపులకు తెరదించుతూ షావోమి (Xiaomi) కొత్త ఓఎస్‌ను భారత్‌లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎమ్‌ఐయూఐ 13 (MIUI 13) పేరుతో షావోమి ఈ ఓఎస్‌ను పరిచయం చేసింది. ముందుగా ప్రీమియం శ్రేణి మొబైల్స్‌లో, తర్వాత మిండ్ రేంజ్‌, చివరగా బడ్జెట్‌ ఫోన్లలో అప్‌డేట్‌ చేయనున్నట్లు తెలిపింది. సరికొత్త డిజైన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో యూజర్స్‌కు మెరుగైన సేవలు అందించడం కోసం డిజైన్‌, ఫీచర్స్ పరంగా ఇందులో మార్పులు చేసినట్లు షావోమి చెప్పింది. ముఖ్యంగా ఫోన్‌లో అవసరంలేని సిస్టం యాప్స్‌ను యూజర్‌ అన్‌ఇన్‌స్టాల్ చేసుకునే సౌకర్యం ఈ కొత్త ఓఎస్‌లో ఉన్నట్లు  తెలిపింది. మరి ఎమ్‌ఐయూఐ 13 ఏయే డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది.. ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం. 

* ఫోన్ పనితీరును మెరుగుపరిచేందుకు ఈ కొత్త ఓఎస్‌లో ఆప్టిమైస్డ్‌ ఫైల్ స్టోరేజ్ సిస్టంను షావోమి ఉపయోగించింది. దీంతో ఫోన్‌ 60 శాతం మెరుగైన పనితీరును అందించడమే కాకుండా 10 శాతం బ్యాటరీ సామర్థ్యం మెరుగవుతుందని షావోమి పేర్కొంది. 

* ఇందులో యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)ను మూడు గ్రూపులుగా విభజించారు. కోర్‌, అన్‌ఇన్‌స్టాలబుల్ యాప్స్‌, రిమూవబుల్ యాప్స్‌. కోర్‌లో ఫోన్‌, మెసేజ్‌, అలారమ్‌, సెట్టింగ్స్‌, కెమెరా, ఎమ్‌ఐ పే, గ్యాలరీ వంటి యాప్స్ ఉంటాయి. ఇక అన్ఇన్‌స్టాల్‌ గ్రూప్‌లో వీడియో ప్లేయర్‌, వాతావరణం, పాడ్‌కాస్ట్‌, కంపాస్‌, నోట్‌పాడ్ వంటి యాప్స్‌ ఉంటాయి. రిమూవబుల్‌లో కేలండర్‌, వాల్‌పేపర్‌, ఫైల్‌ డౌన్‌లోడ్, మ్యూజిక్‌ వంటి యాప్స్ ఉంటాయి. వీటిలో కోర్ మినహా మిగిలిన రెండు గ్రూపుల్లోని యాప్‌లను యూజర్‌ అన్‌ఇన్‌స్టాల్‌ చేయడంతోపాటు, ఫోన్‌ నుంచి డిలీట్ చేయొచ్చు. 

* ఒకేసారి వేర్వేరు యాప్‌లను ఉపయోగించుకునేందుకు వీలుగా మల్టీ-టాస్కింగ్ చేసే వారి కోసం ఈ ఓఎస్‌లో సైడ్‌ బార్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో యూజర్స్ తమకు నచ్చిన యాప్‌లను పిన్ చేసుకుని సులువుగా యాక్సెస్‌ చేయొచ్చని షావోమి తెలిపింది. 

* ముందుగా ఎమ్‌ఐ 11 అల్ట్రా, ఎమ్‌ఐ 11ఎక్స్ ప్రో, షావోమి 11టీ ప్రో, ఎమ్‌ఐ 11ఎక్స్‌, షావోమి 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ, ఎమ్‌ఐ 11 లైట్, రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మాక్స్‌, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ 10 ప్రైమ్‌ మోడల్స్‌లో ఎమ్‌ఐయూఐ 13ను అప్‌డేట్ చేయనున్నట్లు షావోమి తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోపే ఈ అప్‌డేట్‌ను అందివ్వనున్నట్లు పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని