Xiaomi SmartFan: వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్‌తో షావోమి స్టాండ్ ఫ్యాన్

స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమి కొత్తగా మరో స్మార్ట్‌ హోం అప్లయెన్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమి స్మార్ట్‌ స్టాండింగ్ ఫ్యాన్‌ 2 పేరుతో స్టాండ్ ఫ్యాన్‌ను పరిచయం చేసింది... 

Published : 12 Jul 2022 02:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమి కొత్తగా మరో స్మార్ట్‌ హోం అప్లయెన్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమి స్మార్ట్‌ స్టాండింగ్ ఫ్యాన్‌ 2 (Xiaomi Smart Standing Fan 2) పేరుతో స్టాండ్ ఫ్యాన్‌ను పరిచయం చేసింది. ఇది అమెజాన్‌, గూగుల్ వాయిస్‌ అసిస్టెంట్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 100 స్పీడ్ లెవల్స్‌తోపాటు త్రీ-డైమెన్షల్‌ ఎయిర్‌ ఫ్లోలు ఉన్నాయి. ఇంకా ఈ ఫ్యాన్‌లో ఉన్న ఫీచర్లేంటి? ధర ఎంత అనేది తెలుసుకుందాం. 

షావోమి స్మార్ట్‌ స్టాండింగ్ ఫ్యాన్‌ 2 ఫీచర్లు

ఈ ఫ్యాన్‌లో డ్యూయల్‌ డిజైన్‌తో బిఎల్‌డీసీ ఇన్వర్టర్‌ కాపర్‌ వైర్ మోటార్‌ ఇస్తున్నారు. అల్యూమినియం మోటార్‌తో పోలిస్తే కాపర్ మోటార్ ఎక్కువ కాలం పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అధిక ఎయిర్‌ఫ్లో కోసం 7+5 వింగ్‌ షేప్‌ బ్లేడ్‌లు ఉన్నాయి. ఈ ఫ్యాన్‌ను యాప్‌ సాయంతో కంట్రోల్ చేసేందుకు ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను యూజర్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫ్యాన్‌లోని 100 స్పీడ్ లెవల్స్‌ను యాప్‌ ద్వారా మార్చుకోవచ్చు. ఈ ఫ్యాన్‌ అత్యధికంగా 55.8 డెసిబుల్‌ నాయిస్‌ లెవల్ ఎయిర్‌ఫ్లోను అందిస్తుంది. షావోమి స్మార్ట్‌ స్టాండింగ్ ఫ్యాన్‌ ధర ₹ 9,999. ప్రారంభ ఆఫర్‌ కింద ₹ 5,999కే అందిస్తున్నట్లు షావోమి చెబుతోంది. యూజర్లు షావోమి వెబ్‌సైట్‌ ద్వారా ముందస్తు ఆర్డర్‌ చేయొచ్చు. జులై 19 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని