
Xiaomi 12 Series: MIUI 13 ఓఎస్‌తో షావోమి తొలి స్మార్ట్ ఫోన్
ఇంటర్నెట్‌డెస్క్: షావోమి కంపెనీ ప్రీమియం శ్రేణిలో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. షావోమి 12, షావోమి 12 ప్రో, షావోమి 12ఎక్స్ పేరుతో తీసుకొచ్చింది. వీటితోపాటు షావోమి కొత్త ఓఎస్ ఎమ్ఐయూఐ 13ను ఈ ఫోన్లలో పరిచయం చేసింది. ఇందులో యూజర్స్ వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమిస్తూ ఫేస్ వెరిఫికేషన్ ప్రొటెక్షన్, ప్రైవసీ వాటర్ మార్కింగ్, ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ తీసుకొచ్చింది. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమ్ఐయూఐ 13 ఓఎస్‌తో పనిచేస్తాయి. మరి షావోమి 12 మోడల్స్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధరెంత వంటి వివరాల గురించి తెలుసుకుందాం.
షావోమి 12
ఈ ఫోన్లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో వెనుక మూడు కెమెరాలు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 5 ఎంపీ మాక్రో షూటర్ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో హర్మాన్ కార్డన్ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ వైర్ ఛార్జింగ్‌కు, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
షావోమి 12 ప్రో
ఈ మోడల్లో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 480 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల డబ్లూక్యూహెచ్డీ+ ఈ5 అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇందులో యాపిల్ ప్రీమియం ఫోన్లలో ఉపయోగించే ఎల్టీపీఓ బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది తక్కువ బ్యాటరీ పవర్‌తో రిఫ్రెష్ రేట్‌ను సర్దుబాటు చేసుకుంటూ హై రిజల్యూషన్ రిఫ్రెష్ రేట్‌ను ఇస్తుంది. షావోమి 12 ప్రోలో కూడా వెనుకవైపు మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు మూడు 50 ఎంపీ కెమెరాలు. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్లో హర్మాన్ కార్డన్ ట్యూనింగ్‌తో నాలుగు స్పీకర్లు ఇస్తున్నారు. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ వైర్, 50 వాట్ వైర్లెస్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
షావోమి 12ఎక్స్
ఇందులో 6.28 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ధర
షావోమి 12, 12 ప్రో మోడల్స్‌ను 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 8 జీబీ/ 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. షావోమి 12 ఎక్స్ మోడల్ 8 జీబీ/128 జీబీ, 8 జీబీ/256 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2022 ప్రధమార్థంలో భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ధర విషయానికొస్తే భారత మార్కెట్లో షావోమి 12 ప్రారంభ ధర రూ. 43,500, 12 ప్రో ప్రారంభ ధర రూ. 55,100, 12ఎక్స్ ప్రారంభ ధర రూ. 37,500 ఉంటాయని మార్కెట్ వర్గాల అంచనా.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.