Xiaomi: రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ వచ్చేసింది.. ఫీచర్లు ఇవే..

 చైనా టెక్‌ దిగ్గజం షావోమీ (Xiaomi) తన సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదల చేసింది.

Published : 26 Jan 2022 22:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా టెక్‌ దిగ్గజం షావోమీ (Xiaomi) రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదల చేసింది. రెడ్‌మీ నోట్‌ 10కు కొనసాగింపుగా మొత్తం నాలుగు మోడల్స్‌తో ఈ సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ప్రీమియం శ్రేణిలో రెడ్‌మీ నోట్‌ 11 ప్రో, 11 ప్రో 5జీని.. బడ్జెట్‌ కేటగిరీలో రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌, రెడ్‌మీ నోట్‌ 11ను విడుదల చేసింది. వీటిని ఫిబ్రవరి 9న భారత్‌లో లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.

ప్రీమియం శ్రేణిలో రెడ్‌మీ నోట్‌ ప్రో 11-5జీ మోడల్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌తో వస్తోంది. దీని ఇంటర్నల్ స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే రెడ్‌మీ నోట్‌ 11 ప్రో.. మీడియాటెక్ హీలియో జీ96 చిప్‌సెట్‌తో రానుంది. ఈ రెండూ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌‌‌కు సపోర్ట్‌ చేస్తాయి. 5,000mAh బ్యాటరీ, MIUI 13తో రానున్నాయి.

ఇక బడ్జెట్‌ కేటగిరీలో Redmi Note 11, Note 11S రెండూ 6.4-అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 5,000 mah బ్యాటరీ, 33W ఛార్జర్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తున్నాయి. నోట్‌ 11లో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌, 108 MP ప్రధాన కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో 2MP డెప్త్ కెమెరా సెటప్‌, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. నోట్‌ 11ఎస్‌ మీడియాటెక్‌ హీలియో జీ96 ప్రాసెసర్‌, 50 MP ప్రధాన కెమెరా 16MP సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

ధరెంతంటే..? 

షావోమీ నోట్‌ ప్రో 5జీ 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ ప్రారంభ ధరను కంపెనీ $329గా నిర్ణయించగా.. భారత్‌లో దీని ధర రూ.24,636గా ఉంటుందని అంచనా. అయితే, మిగిలిన వాటి ధరలను కంపెనీ ప్రకటించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని