మీరు నడిస్తే... వీళ్లు డబ్బులిస్తారు
రోజూ నడిస్తే ఆరోగ్యం... ఈ మాట చాలా రోజుల నుంచి వింటున్నాం. అయితే ఆరోగ్యంతోపాటు డబ్బులు కూడా వస్తాయంటే..
రోజూ నడిస్తే ఆరోగ్యం... ఈ మాట చాలా రోజుల నుంచి వింటున్నాం. అయితే ఆరోగ్యంతోపాటు డబ్బులు కూడా వస్తాయంటే.. ‘అరె భలే ఉందే ఈ ఆప్షన్’ అనుకుంటున్నారా. అయితే ఈ కథనం మీ కోసమే.. ఇంకెందుకాలస్యం నడిచి డబ్బులు సంపాదించేయండి!
మామూలు స్టెప్స్ ట్రాకింగ్ యాప్స్ అయితే మీరెన్ని అడుగులు వేశారో చెబుతాయి. ఈ యాప్స్ అయితే వాటితోపాటు, నడక వల్ల మీరెంత డబ్బు సంపాదించారో కూడా చెబుతాయి. అవేంటి.. ఎలా వాడాలో చూద్దాం.
నడకతో విరాళం...
నడిచి డబ్బులు సంపాదించి.. ఆ డబ్బును స్వచ్ఛంధ సేవా సంస్థలకు ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే మీకు శ్రమ తగ్గించేలా ఛారిటీ మైల్స్ యాప్‌ను రూపొందించారు. యాప్ ఇన్స్టాల్ చేసి, ఓపెన్ చేయగానే... ‘మీరు ఏ ఛారిటీకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు?’ అని అడుగుతుంది. మీకు నచ్చిన సంస్థ పేరు ఎంచుకున్నాక యాప్ పని చేయడం మొదలుపెడుతుంది. మీరు వేసిన అడుగులు, దూరం లెక్కించి మీ నడకకు ఎంత డబ్బులు వచ్చాయో చెబుతుంది. ఇందులో బృందంగానూ డబ్బులు సంపాదించి, దానం చేసే ఆప్షన్ ఉంది. • యాప్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
పందెం కాసి నడవండి
బెట్ కాసి... అనుకున్నది సాధించేవాళ్లను చాలామందిని చూసే ఉంటారు. మీరు కూడా అలాంటి పని ఎప్పుడో ఒకప్పుడు చేసే ఉంటారు. అలా అయితే ‘స్టెప్ బెట్’ యాప్ మీకు ఉపయోగపడుతుంది. ఇందులో రోజకు ఇన్ని అడుగులు వేయాలి అంటూ కొన్ని టాస్క్‌లు ఉంటాయి. వాటిని అధిగమిస్తే మీరు కాసిన బెట్‌కు మించి డబ్బులు వస్తాయి. అయితే బెట్లో ఉన్న టాస్క్‌లు చేయకపోతే మీరు ఓడిపోతారు. స్టెప్ బెట్లో నేరుగా స్టెప్ కౌంటింగ్ ఉండదు. ఫిట్‌బిట్, గూగుల్ ఫిట్, శాంసంగ్ హెల్త్ లాంటి ప్రముఖ యాప్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. వాటి ఆధారంగానే యాప్ పని చేస్తుంది. • యాప్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
నడవండి.. కూపన్లు సంపాదించండి
మనకు వచ్చే సొమ్ము డబ్బులే అవ్వక్కర్లేదు.. కూపన్లు వచ్చినా చాలు అనుకుంటే ‘లింపో’ యాప్‌ను వాడి చూడొచ్చు. ఇందులో యాక్టివిటీలు పూర్తి చేస్తే లిమ్ కాయిన్స్ వస్తాయి. వాటిని రెడీమ్ చేసుకొని యాప్‌లోనే అవసరమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. మీరు చేసిన టాస్క్‌లు, ఘనతలను స్నేహితులతో పంచుకుని, వారికి స్ఫూర్తిగా నిలవొచ్చు. లిమ్ టోకెన్స్‌తో గిఫ్ట్ వోచర్లు కూడా పొందొచ్చు. ఫ్రెండ్స్‌ను యాప్‌లోకి ఇన్వైట్ చేసి ఉచిత కాయిన్స్ సంపాదించే ఆప్షన్ కూడా ఉంది. స్టెప్స్ కౌంటింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మొబైల్ బ్యాటరీ వినియోగాన్ని తగ్గించొచ్చు. సాధారణంగా అయితే యాప్ ట్రాక్ ఆప్షన్లో ఆన్ అయి ఉంటుంది. • యాప్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
అడుగులకు.. కాయిన్స్ ఇస్తుంది
1500 అడుగులు టార్గెట్... దానిని సాధిస్తే రివార్డ్ పాయింట్లు/కాయిన్స్ వస్తాయి. ఇదీ ‘యోడో’ యాప్ కాన్సెప్ట్. అంతేకాదు ఈ యాప్‌లో రోజూ లాగిన్ అయినా కాయిన్స్ వస్తాయి. అలా టాస్క్‌లు చేస్తూ, యాప్ అడిగిన పనులు చేస్తే కాయిన్స్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన కాయిన్స్‌ను ఎక్స్ఛేంజీ చేసుకొని పేపాల్ క్యాష్‌ను పొందొచ్చు. ఈ యాప్ టాస్క్‌ల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి ఒక్కో రకమైన కాయిన్స్ వస్తాయి. దీంతోపాటు ఇందులో హార్ట్‌రేట్, బ్లడ్ ప్రజెర్, బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ విస్కాసిటీ, బీఎంఐ, పల్స్వేల్స్ లాంటి వివరాలను పొందుపరుచుకోవచ్చు. మీ పరిసరాల్లో ఆ యాప్ వాడుతున్నవాళ్లు ఉన్నా చూపిస్తుంది. • యాప్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
ఆడియో ఎలర్ట్స్ వస్తాయ్
వాకింగ్ పూర్తయింది.. అంటూ సెల్ఫీ తీసుకొని స్టేటస్లు పెట్టడం, గ్రూపుల్లో పోస్ట్ చేయడం లాంటివి చేస్తుంటారా? అయితే ‘రన్టోపియా’ యాప్ మీకు నచ్చుతుంది. ఇందులో కమ్యూనిటీ ట్యాబ్‌లో మీ స్నేహితుల కసరత్తుల స్టేటస్లు తెలుసుకోవచ్చు, మీరు కూడా పంచుకోవచ్చు. ఇక రివార్డులు ఎలానూ ఉంటాయి. వాటి వివరాలు ఇక్కడే షేర్ చేయొచ్చు. యాప్ ఇన్స్టాల్ చేసి, ఖాతా తెరిచి నడిస్తే ‘స్పోర్ట్స్ కాయిన్స్’ వస్తాయి. వాటిని యాప్‌లోని షాప్ సెక్షన్లో రెడీమ్ చేసుకొని కూపన్లు సంపాదించొచ్చు. ఆ తర్వాత వాటితో మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఈ యాప్‌లో ఆడియో ఎలర్ట్స్ ఆప్షన్ కూడా ఉంది. రన్,వాక్, సైక్లింగ్ ఫీచర్లను యాప్ సపోర్టు చేస్తుంది. • యాప్ డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్‌ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!